వచ్చే ఎన్నికల ప్రచారంలో భాగంగా సోషల్ మీడియాలో రెచ్చిపోవటానికి వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరింత జోరు పెంచుతున్నారు. పోయిన ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రచారంలో  వైసిపి బాగా వెనకబడింది. తృటిలో చేజారిన అధికారాన్ని వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న జగన్ ఆలోచనలకు తగ్గట్లుగానే ప్రస్తుతం వైసిపి ప్రణాళికలు వేస్తోంది. అందుకే గడచిన మూడున్నరేళ్ళుగా సోషల్ మీడియాలో జగన్ కు అనుకూలంగా బాగానే ప్రచారం జరుగుతోంది.

Related image

ఇక్కడ వైసిపి సోషల్ మీడియా విభాగం రెండంచెల వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఒకవైపు జగన్ అనుకూల ప్రచారం చేస్తూనే మరోవైపు చంద్రబాబునాయుడు, నారా లోకేష్, తెలుగుదేశంపార్టీలకు వ్యతిరేకంగా దుమ్ము దులిపేస్తోంది. చంద్రబాబు, లోకేష్ ప్రకటనలకు జగన్ కన్నా ఎక్కువగానే కౌంటర్లు ఇస్తోంది. ఇప్పటి చంద్రబాబు ప్రకటనలపై ఒకపుడు చంద్రబాబు చర్యలను సాక్ష్యాధారాలతో సహా ఉతికి ఆరేస్తోంది.

 Related image

వైసిపి సోషల్ మీడియా ధాటిని చంద్రబాబు, లేకేష్ తట్టుకోలేకే వైసిపి సానుభూతిపరులపై అనేకుల మీద కేసులు పెడుతున్నారు. తమకు, ప్రభుత్వానికి వ్యతరేకంగా వస్తున్న పోస్టులను చంద్రబాబు, చినబాబు సహంచలేకపోతున్నారు. అందుకే ఇప్పటి వరకూ కనీసం ఆరుగురిమీద కేసులు పెట్టి జైళ్ళరే పంపారు. సరే, ఎలాగూ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి సోషల్ మీడియా జోరును మరింత పెంచాలని జగన్ నిర్ణయించారు.

Related image

అందులో భాగంగానే మండలస్ధాయిలో కూడా సోషల్ మీడియా ప్రచారం కోసం ప్రత్యేకంగా కమిటీలను వేశారు. రాష్ట్రంలోని 6 వందలపై చిలుకు మండలాల్లో బాగా యాక్టివ్ గా పనిచేసే కురాళ్ళతో పార్టీ కమిటీలు వేసింది. ప్రతీ కమిటీలో కనీసం 15 మందకి తగ్గకుండా ఉంటారట. చూడబోతే వైసిపి సోషల్ మీడియా జోరు మరింత పెరగనుంది. మరి, చంద్రబాబు, చినబాబు ఎలా తట్టుకుంటారో చూడాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: