ఆమె వయ్యారి భామ. అందమే కాదు. అద్భుతమైన మేధస్సూ ఉంది. ఆమె ఎన్నో వూసులు చెబుతుంది. ఆమెకు తెలియని విషయలు అసలు లేవంటే లేవు. ఆవకాయ నుంచి అమెరికా వరకూ అన్నీ ఆమె మెదడుతో నిక్ష్తిప్తం . ఏది అడిగితే అది ఇలా ప్రశ్న వేసి అలా బదులు తెలుసుకోవచ్చు. మరి ఆమె ఇపుడు విశాఖ  విచ్చేస్తోంది.


ఎవరీ సోఫియా :


సొఫియా ఎవరూ  అన్న విషయానికి వస్తే ఆమెను తయారుచేసింది  హాంగ్ కాంగ్ కి చెందిన హాన్సన్స్ సంస్థ.  2016 ఫిబ్రవరి 14 న సొఫియాను ప్రపంచం ముందుకు వారు తీసుకువచ్చారు. ఆ తరువాత ఆమె విప్లవం స్రుష్టించింది. విశ్వంలొ తొలి హ్యూమనాయిడ్ రోబోగా అవతరించింది.  అంతా ఒక్కసారిగా తనవైపు చూసేలా చేసింది. ఆమె యాభయికి పైగా భావ వ్యక్తికరణ చేయగలదు. అనేక భాషలు మాట్లాడగలదు. ఆమె తెలివి అపారం. ఆమె సమయస్పూర్తి అపూర్వం.  ఆమెను చూసి ముచ్చటపడిన సౌదీ అరేబియా ప్రభుత్వం  తొలి పౌరసత్వం ఆమెకు అందించింది.


అమె ముఖ్య అతిథిగా :


విశాఖలో ఈ రోజు నుంచి మొదలవుతున్నఫిన్ టెక్ అంతర్జాతీయ సదస్సుకు సోఫియా ముఖ్య అతిధిగా రాబోతోంది. ఆమెను చూసేందుకు అమె పలుకులు వినేందుకు విశాఖ వేయి కళ్ళతో ఎదురుచూస్తోంది. ఈ సదస్సులో సొఫియా అనేక అంశాలపై మాట్లాడుతారని నిర్వాహకులు తెలియచేశారు అంతె కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనూ సోఫియా మాట్లాడుతుంది. ఆమె విశాఖకు రావడం గర్వకారణమని నగరవాసులు అంటున్నారు. ఆమెను ప్రత్యక్ష్యంగా  చూసేందుకు  కూడా పొటీ పడుతున్నారు. వీలు కాకపోతే టీవీల ద్వారానైనా ఆమెను చూస్తామని అంటున్నారు. మొత్తానికి విశాఖను సోఫియా మానియా ఊపేస్తోంది.

 




మరింత సమాచారం తెలుసుకోండి: