#మీటూఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిదో అందరికి తెలిసిందే..ఏకంగా కేంద్ర మంత్రి తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఈ ఉద్యమం తాలూకూ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ ,బాలీవుడ్ ,టాలీవుడ్ ఇలా అన్ని వుడ్ లలో మీటూ ప్రకంపనలు కలకలం రేపాయి.. “ఆ డోళ్ళ” ని హింసిస్తున్నారు అంటూ ఒంటికాలిపై లేచిన మహిళలకి ఇప్పుడు #మెన్ టూ ఉద్యమం గట్టి కౌంటర్ ఇస్తోంది..ఇంతకీ ఈ #మెన్ టూ ఎలా పుట్టింది అనే వివరాలలోకి వెళ్తే..

 

“Me Too” సాకుగా చూపించి కొంతమంది ఆడవాళ్ళు కావాలని బురద జల్లుతున్నారు అంటూ ఈ మధ్యకాలంలో వ్యాఖ్యలు వచ్చాయి ఆడవాళ్లే కాదు మగవాళ్ళు సైతం ఆడవారి వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు..అవేమి ఎవరికీ కనపడవు...చివరికి వారికోసం ఏర్పాడు చేయబడ్డ చట్టాలని ఉపయోగించి కొంతమంది ఆడవారు మగవారిపై కక్ష సాధింపులు చేస్తున్నారని ఎన్నో సందర్భాలలో రుజువయ్యింది కూడా..అలాంటి వారికోసం మేమున్నాము అంటూ వచ్చింది “Men Too” ఆడవాళ్లకే నా లైంఘిక వేధింపులు మగవాళ్ళకి ఉండవా అంటూ వెలుగులోకి తీసుకొస్తున్న“Men Too” ఉద్యమానికి స్పందన విపరీతంగా వస్తోందట ఆదిలోనే విపరీత ఆదరణ మొదలయ్యింది.  

 

'మీటూ' ఉద్యమం తరహాలోనే.. స్త్రీల వేధింపులు, సాధింపులనూ వెలుగులోకి తేవడానికి 'మెన్‌టూ' అనే ఉద్యమానికి శ్రీకారం చుట్టారు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న 'క్రిస్ప్‌' అనే స్వచ్ఛంద సంస్థ ఈ సంస్థ నిర్వహించేది ఎవరో కాదు సామాజిక కార్యకర్త కుమార్‌ జాగిర్దార్‌. తప్పుడు కేసులు, ఆరోపణల కారణంగా బాధపడుతున్న పురుషుల ఆవేదనను వెలుగులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు..ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే  వ్యవస్థాపకుల్లో ఫ్రాన్స్‌ మాజీ రాయబారి పాస్కల్‌ మజురియర్‌ ఉండటం విశేషం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: