సనాతనం, సదాచారం, సాంప్రదాయం, సంస్కృతి వీటి నుండి ఉద్భవించిందే హైందవం. దీన్ని కొందరు మతం అంటారు, కొందరు సాంప్రదాయం అంటారు, ఇంకొందరు జీవన విధానం అంటారు, మరి కొందరు మానవత్వం అంటారు. ఏదేమైనా ఒక మనిషి సాధారణ ఆలోచనల ప్రకారం హైందవం లో ఏ జాతైనా మతమైనా ఏ సంస్కృతైనా ఇట్టే ఇమిడి పోగలదు. ఆ కారణం గానే అలగ్జాండర్ నుండి ఆంగ్లేయులవరకు ఈ దేశంలో అతి తేలిగ్గా ఇమిడిపోయారు. ఈ జీవన విధానంలో బాగస్వాములయ్యారు.

Image result for national ayyappa devotee association 

అలాంటివారే తాము అమృతంలాగా స్వీకరించిన హైందవ మాత స్తన్యాన్ని విషపూరితం చేసినా! మాత...కదా!... సంభాళించు కుంది, మతం కంటే మానవత్వం గొప్పదని నమ్మింది.

 Image result for ayyappa supreme court LDF

నాటి గ్రీకుల దండయాత్రల నుండి మొగలులు, తురుష్కులు, బహమనీ సుల్తానులు ఒకరేమిటి విభిన్న జాతుల స్వార్ధపరులు కన్నేసి ఈ దేశాన్ని కబళించాలని ప్రయత్నించి నా అందరిని మాతృదేవతలా తన కొంగు చాటున నిలిపి తల్లిలానే నీడ నిచ్చింది జాడ చూపింది.

 Related image

ఒక స్త్రీ మరియు న్యాయమూర్తి ఐన ఇందూ మల్-హోత్రా మాత్రమె ఈ తీర్పుకు మద్దతు నివ్వలేదు.


మత విశ్వాసాలు వేరు - ప్రాధమిక హక్కులు వేరు - సమానత్వంలాంటి వాటిని చూపుతూ -కోర్టు లకు ఇలాంటి విషయాల్లో తీర్పులు ఇచ్చే హక్కు లేదు - అది సామాజిక దురాచారాలైన సతిసహ గమనం వంటివైతే తప్ప" ...ఇందూ మళోత్రా


ఇంతలో క్రైస్తవ రాజ్యాలైన పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ తదితర ఐరోపా వాసులు భారత ప్రాక్ పశ్చిమ ఉత్తర సముద్ర తీరాల గుండా మార్గాలెతుక్కొని భారత్ లో వ్యాపారం చేసుకుంటా మని వచ్చినా అవకాశం ఇచ్చిన భారత మాత ఒడిలో ఒదిగి చివరకు ఈనాటికి రాజ్యాంగం పేరుతో సకల మత సమన్వయంతో లౌకికత్వంతో భినత్వంలో ఏకత్వంగా కలసి జీవించే ప్రజల మద్య మత విశ్వాసాలను ఆధారం చేసుకొని కొన్ని రాజకీయ అరాచక శక్తులు భారత ఐకమత్యాన్ని చీల్చాలని ప్రయత్నిస్తున్నాయి.

Image result for ayyappa supreme court LDF

రాజ్యాంగ నిర్మిత న్యాయ వ్యవస్థనే తప్పుదారి పట్టించేలా లౌక్యంగా చేసిన శాసనాల నిర్మాణం నేడు రాజ్యాంగానికే జన్మనిచ్చిన సంస్కృతి మీదే న్యాయస్థానం తీర్పు పేరుతో సనాతన సంస్కృతి ద్వారా ఉత్పన్నమైన సనాతన సాంప్రదాయం మీదే దాడి చేసింది.


జనవరి 26, 1950 రోజున అమల్లోకి వచ్చిన రాజ్యాంగం భారతీయ సంస్కృతిలో ఐఖ్యమైన అధిక, అల్ప, స్వల్ప, అత్యల్ప సంఖ్యాకులైన హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన, బౌద్ధ, సిక్కు తదితర జాతుల ఐఖ్యతగా నిర్మించుకున్న రాజ్యాంగ నిర్మిత న్యాయవిభాగం నేడు తన జన్మకే ఆధార భూతమైన హైందవ సనాతన ధర్మం లోకే చొచ్చుకువచ్చింది.

Image result for ayyappa supreme court LDF 

భారత సనాతనధర్మంపై చట్టంపెరుతో దాడిచేస్తున్నహిందూ వ్యతిరేఖశక్తులు పిల్లొచ్చి పక్షిని ఎక్కిరించినట్లు వివాదాల్లో "శబరిమల" -


అదే "శబరిమలేశ్వరుడు" సన్నిధి లోకి సనాతన ధర్మం నిషేదిత మహిళల ప్రవేశానికి చట్టం సమ్మతి తెలపటమే……దక్షిణాదిలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన కేరళ రాష్ట్రం లోని శబరిమలై (శబరిగిరులు) ఇపుడు వివాదాలమయంగా మారింది.

Image result for women journalists tries to enter Sabarimala

రెహానా ఫాతిమా, కవిత జక్కల్ ఇద్దరు స్త్రీ పాత్రికేయులు ఫెమినిస్ట్ యాక్టివిస్ట్స్ -మేరీ స్వీటీ శబరిమలలోకి ప్రవేశించే ప్రయత్నంలో  

Image result for Indu malhotra comments on women entry in sabarimala in judgement

గత నెలలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించ డమే ఇందుకు ప్రధాన కారణం. రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఇచ్చిన తీర్పు న్యాయశాస్త్రం ప్రకారం సమ్మతమే కావచ్చు. కాని శాసనాలను నిర్మించే ప్రజా ప్రతినిధులు ఆ ఉపద్రవం నుండి హిందూ ధర్మాన్ని కాపాడే శాసన నిర్మాణాలకు ప్రోది చెయ్యకుండా దాన్ని అమలు పరచటానికి ప్రయత్నించటమే ‘అఖిల హిందూ సమాజం’ న్యాయ ధిక్కారానికే సిద్ధపడు తుంది.

Image result for women journalists tries to enter Sabarimala

దేశ సర్వోన్నత న్యాయస్థానం గత నెలలో 10-50 ఏళ్ల మధ్య వయస్కు లైన మహిళలను అయ్యప్ప దేవాలయంలోకి ప్రవేశించేందుకు అనుమతించాల్సిందేనని తీర్పు చెప్పింది. ఇప్పటివర కూ 50 ఏళ్లకు పైబడినవారు మాత్రమే ఈ ఆలయంలో ప్రవేశించేందుకు అర్హత ఉండేది.

Image result for supreme court judges on sabarimala entry of women

Dipak Misra and comprising Justices Rohinton Nariman, AM Khanwilkar, DY Chandrachud and Indu Malhotra.

ఇపుడు సుప్రీం తీర్పుతో ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల ను కూడా ప్రవేశించేందుకు అర్హులే. దీనిపై సుప్రీం తీర్పును అమలుచేస్తామని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేరళ లోని “ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం” చేసిన ప్రకటనలు అయ్యప్ప భక్తులకేకాదు, హైందవ సదాచార సంపన్నులకు సైతం అంతులేని ఆగ్రహం తెప్పించాయి.

Image result for kerala cm image

సహస్రాబ్ధాల కాలంగా శబరిమల ఆలయంలోకి 50 సంవత్సరాలలోపు మహిళలను అనుమతించే ఆచారం లేనేలేదని, తమ దేవుడు ఆజన్మ బ్రహ్మచారని, అందులోనూ కౌమార ప్రాయంలోని మహిళలు ఆలయంలోకి ప్రవేశించేందుకు అర్హత నిచ్చే మండల (41 రోజులు) దీక్ష సమయంలో వారి ఋతు క్రమ సమస్యలు అడ్డంకిగా మారతాయని, అందువల్లనే 50 ఏళ్లలోపు మహిళలను అనుమతించక పోవటం అనాదిగా వస్తున్న సనాతనాచారాన్ని, హక్కుల పరిరక్షణ అనే కృతక ఆలోచన పేరిట తుడిచి పెట్టడం సాధ్య మయ్యేది కాదని అటు అయ్యప్ప భక్తుల సంఘం, ఇటు దేవాలయ పాలకవర్గం సైతం చెపుతున్నాయి.

Image result for national ayyappa devotee association

సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేసి సనాతనాచారాన్ని అధిక సంఖ్యాకుల మత విశ్వాసాల ను కాపాడవలసిన కేరళ లోని వామపక్ష ప్రభుత్వం ఆ పని చేయనని స్పష్టం చేయడం అయ్యప్ప భక్తులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. దీనితో ప్రభుత్వం చేయనన్న పనిని "జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం" తరపున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. అయినప్పటికీ తీర్పు అమలు అనివార్యం కావడంతో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడాన్ని అయ్యప్ప భక్తుల్లో తీవ్ర నిరసన, ఆగ్రహానికి, అలజడికి కారణమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: