మళ్ళీ పదేళ్ళ తరువాత సీన్ రిపీట్ అవుతుందా అంటే అవుననే ఆన్సర్ వస్తోంది. నాడు పూరించిన శంఖం మళ్ళీ రమ్మంటోంది. ఎక్కాల్సిన రధం రెడీగానే ఉంది. చెప్పాల్సిన కధ కూడా సిధ్ధంగానే ఉంది. స్టార్ట్, షాట్ అన్న పిలుపే  లేట్ అన్నట్లుగా మొత్తం వాతావరణం ఉంది.


ఆ గూటికేనా :


కొండంత తండ్రి హరిక్రిష్ణను కోల్పోయిన బాధలో ఉన్న జూనియర్ ఎంటీయర్ మెల్లగా చేరాల్సిన గూటికే చేరుకుంటున్నాడు.  ఆయన మళ్ళీ నారా, నందమూరి శిబిరానికి చేరువ అవుతున్నాడు. ఈ వైపు నుంచి పిలుపులు మొదలయ్యాయి. ఆ వైపు నుంచి సానుకూల స్పందన కూడా కనిపిస్తోంది. పరిస్థితి చూస్తూంటే ఏ క్షణానికైనా జూనియర్ టీడీపీ గూటికి చేరడం ఖాయమన్న మాట వినిపిస్తోంది.


విభేదాలకు సెలవు :


అరవింద సమేత సినిమా సక్సెస్ మీట్ వెనక చాలా కధ జరిగిపోయింది. పేరుకు సినిమా ప్రోగ్రాం అయినా దాన్ని రాజకీయంగానే అంతా చూస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత అబ్బాయిని బాహాటంగా బాబాయి హత్తుకున్నాడు. ఇద్దరూ చాల సేపు కబుర్లు చెప్పుకున్నారు. ఒకరిని ఒకరు ప్రేమతో పలకరించుకున్నారు. ఇది చాలదా జూనియర్ రూట్ ఎటువైపో చెప్పడానికి. బాబాయ్ బాలయ్య ఇపుడు మెత్తబడ్డాడు, జూనియర్ సైతం చేతులు కలిపాడు, రేపటి రాజకీయానికి ఇది మంచి ఇంటెరెస్టింగ్ మ్యాటరే మరి.


అదే కోరుకున్నది కూడా :


నిజానికి చాలా కాలం క్రితమే జూనియర్ ని తిరిగి తమ వైపునకు తిప్పుకోవాలని బాబు అండ్ కోకు ఉండేదట. మధ్యన బాబాయ్ బాలయ్య అడ్డుపడకపోతే ఎపుడో జూనియ‌ర్ బాబు క్యాంప్ లో  చేరిపోయేవాడు. అయితే ఇన్నాళ్ళూ బాలయ్య కోపానికి జడిసే తండ్రీ కొడుకులు మౌనంగా ఉంటూ వచ్చారు. మరో వైపు అక్కడ హరి క్రిష్ణ కూడా మొండి ఘటమే. ఆయనతో వేగడమూ బాబుకు కష్టమయ్యేది. ఇపుడు ఆ వైపు ఆయన లేకుండా పోయారు. దాంతో వేగంగా పావులు కదిలాయి. బాలయ్యని మెత్తబరచింది ఎవరైనా అది జరిగిపోయింది. ఇపుడు  వారి కోరిక అలా తీరిపోయింది.


ఎన్నికల ప్రచారంలోకి :


రేపటి ఏపీ ఎన్నికల ప్రచారంలోకి జూనియర్ దూకుతాడని ఇప్పటికైతే రూఢీగా వస్తున్న వార్తలు జూనియర్ ప్రచారం చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుందన్నది తెలిసిందే. టాప్ స్టార్ గా ఉంటున్న జూనియర్ కి టీడీపీలోనూ మంచి ఫ్యాన్ మైల్ ఉంది. ఎటూ పవన్ ఎదురు నిలిచి తొడ గొడుతున్నారు. ఇపుడు ఆ లోటుని సొంత కుటుంబం నుంచే భర్తీ చేసుకోవచ్చున‌ని. గ్లామర్ కి గ్లామర్, గ్రామర్ కూడా కలగలసి పుష్క‌లంగా ఓట్ల పంట పండుతుందని టీడీపీ ఆశిస్తోంది. మరి మిగతా సినిమా రాజకీయ తెర మీదే చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: