40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు పరిస్ధితి అత్యంత దయనీయంగా తయారైంది. ఇంతకన్నా దిగజారిపోయేందుకు ఇక ఇంకేమీ లేదు కూడా. ఇంతకీ విషయం ఏమిటంటే, ఈరోజు తెలంగాణా టిడిపి పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఆ సమావేశం జరిగిన తీరుతెన్నులు, చంద్రబాబు మాట్లాడిన విషయాలు విన్న తర్వాత తమ్ముళ్ళే నివ్వెరపోతున్నారు. ఎందుకంటే, టిడిపి పాలిట్ బ్యూరో సమావేశంలో కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడటమే కాకుండా నేతలు కూడా ఎవరూ వ్యతరేకంగామాట్లాడవద్దని కట్టడి చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


సమావేశంలో ముందు నేతలు మాట్లాడుతూ, పొత్తుల్లో భాగంగా 30 సీట్లు కావాలని అడగమన్నారట. నిజానికి నేతలు చెప్పిన సంఖ్య చాలా ఎక్కువ. తెలంగాణాలో తెలుగుదేశంపార్టీ పరిస్ధితి ప్రస్తుతం వెంటిలేటర్ మీదున్న విషయం అందరికీ తెలిసిందే. తర్వాత నేతలతో చంద్రబాబు మాట్లాడుతూ, 12 సీట్లిస్తామని కాంగ్రెస్ చెబుతోందని అంతకుమించి మనం అడిగేందుకు కూడా లేదని స్పష్టం చేయటంతో నేతలు నోరెళ్ళపెట్టారట. 12 సీట్లు తక్కువే అయినా మనం చేయగలిగింది కూడా ఏమీ లేదని చంద్రబాబే తేల్చిచెప్పేశారు.

 

నేతల మనోభావాలను గ్రహించిన చంద్రబాబు వెంటనే సర్దుకుని 12 నియోజకవర్గాలు తీసుకుని అదనంగా ఇంకో ఐదు సీట్లు అడుగుదామంటూ వారికి ఓదార్పు మాటలు చెప్పారు లేండి. నేతలు చెబుతున్నట్లుగా 30 సీట్లు అడిగితే మన పరువు పోవటమే కాకుండా పొత్తులకు కూడా విఘాతం కలుగుతుందన్నారు. కెసియార్ ఓటమే ధ్యేయంగా మహాకూటమి ఏర్పడిన విషయాన్ని గుర్తుపెట్టుకుని నేతలు త్యాగాలు చేయాలంటూ క్లాసు పీకారు.


పొత్తుల్లో భాగంగా సిపిఐ, తెలంగాణా జనసమితి కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఆ పార్టీలడిగినన్ని సీట్లు కాంగ్రెస్ ఇస్తుందో ఇవ్వదో వేరే సంగతి. ముందైతే మనం గట్టిగా అడగాలి కదా అన్న ఉద్దేశ్యంతో సిపిఐ, తెలంగాణా జనసమితి వినిసిస్తున్న గట్టిగా కూడా చంద్రబాబు తన గొంతును వినిపించలేకపోతుండటం గమనార్హం.

 


మరింత సమాచారం తెలుసుకోండి: