పార్టీని న‌డిపించ‌డంలో జ‌గ‌న్ త‌డ‌బ‌డుతున్న‌ట్టే అనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల సీజ‌న్ ప్రారంభ‌మైంది. ఎక్క డిక‌క్క‌డ సీట్ల విష‌యంలో నాయ‌కులు తొంద‌ర‌ప‌డుతున్నారు. మాకు కావాలంటే టికెట్ మాకు కావాల‌ని పోటీ ప‌డుతు న్నారు. వీరిలో వైసీపీలో సుదీర్ఘ కాలం నుంచి ఉన్న‌వారితోపాటు కొత్త‌గా వ‌చ్చిన వారు కూడా ఉన్నారు. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వీరికి ఎలాంటి విష‌యంలో ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గించాలి? అనేవిష‌యంలో జ‌గ‌న్‌కుక్లారిటీ లేకుండా పో తోంది. అదేస‌మ‌యంలో వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయాలు చేయ‌డంలోనూ ఆయ‌న వెనుక‌బ‌డి ఉన్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తు న్నాయి. నిజానికి పార్టీ అధినేత‌గా ఆయ‌న వివాదాలు త‌లెత్త‌కుండానే వ్య‌వ‌హ‌రించాలి. 


కానీ జ‌గ‌న్ మాత్రం ముందు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, దానిద్వారా త‌లెత్తే.. వివాదాలు స‌ర్దు బాటు చేయ‌డానికి త‌ల ప్రాణం తోక‌కు వ‌చ్చే వ‌ర‌కు క‌ష్ట‌ప‌డ‌డం అల‌వాటైంది. ఈ క్ర‌మంలో ఆయ‌న చాలానే కోల్పోతున్నార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. వ‌చ్చేవి కీల‌క ఎన్నిక‌లు మ‌నుట‌యా? మ‌ర‌ణించుట‌యా? అన్న‌ట్టుగా ఉన్న ఈ ఎన్నిక‌ల‌ను జ‌గ‌న్ చాలా సీరియ‌స్‌గానే తీసుకున్నారు. అయితే, అదే స‌మ‌యంలో ఆయ‌న సీరియ‌స్ నిర్ణ‌యాలు తీసుకుని పార్టీని న‌డిపించ‌డంలో మాత్రం వ్యూహాత్మ‌కంగా వెనుక‌బ‌డుతున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. ఎన్నిక‌ల సమ‌యంలో పార్టీలో బ‌లంగా ఉన్న నాయ‌కులు, అధినేత మావాడే అనే చ‌నువు ఉన్న నాయ‌కులు టికెట్లు ఆశిస్తారు. 


అయితే, అధినేత తాను వేసుకున్న అంచ‌నాల‌కు అనుకూలంగానే ముందుకు వెళ్తుంటాడు. ఈ క్ర‌మంలోనే టికెట్లు ఆశించిన వారు భంగ‌ప‌డుతుంటారు. మ‌రివీరిని బుజ్జ‌గించి పార్టీకి ప‌నులు చేసేలా చేసుకోవ‌డంలో అదికార టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబుతో పోల్చుకుంటే.. జ‌గ‌న్ చాలా వెనుక‌బ‌డి ఉన్నార‌ని అనిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఒంగోలు వెంక‌ట‌గిరి నియోజ‌క‌ర్గం విష‌యంలో బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డి రోడ్డెక్కే ప‌రిస్థితి వ‌చ్చింది. ఇక‌, గుంటూరు ప‌శ్చిమ లోనూ ప‌రిస్థితి చేయిదాటి కార్య‌కర్త‌లు ఆత్మ‌హ‌త్యాయ‌త్నాల వ‌ర‌కు ప‌రిస్థితి తీసుకువ‌చ్చింది. అదేవిధంగా చిల‌క‌లూరిపేట లోనూ ఏర్ప‌డింది. 

Image result for pawan kalyan

అయితే, ఇప్పుడు చిల‌క‌లూరి పేట‌లో మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను సముదాయించేందుకు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం కూడా విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. మ‌ర్రిని స‌ర్దుమ‌ణిగించేందుకు ఏకంగా ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విఆఫ‌ర్ చేయ‌డం జ‌గ‌న్ అత్యుత్సాహానికి నిద‌ర్శ‌నంగా ఉంద‌ని అంటున్నారు. ఏదైనా నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తామ‌ని ఇలాంటి సంద‌ర్భాల్లో ఎవ‌రైనా చెబుతారు. కానీ, జ‌గ‌న్ పోయి పోయి ఏకంగా మంత్రి ప‌ద‌విని ఆఫ‌ర్ చేయ‌డం విడ్డూరంగా ఉంది. ఇలా ఆయ‌న ఎంత‌మంది అసంతృప్తుల‌కు మంత్రి ప‌ద‌వులు ఇస్తారో చూడాల‌ని అంటున్నారువిమ‌ర్శ‌కులు. 



మరింత సమాచారం తెలుసుకోండి: