ముందస్తు ఎన్నికలను బోగస్ ఓట్ల వివాదం వదిలేట్లు లేదు. బోగస్ ఓట్ల ఏరివేతపై ఇఫ్పటికే కాంగ్రెస్ పార్టీ ఓసారి కోర్టు మెట్లెక్కింది. కాంగ్రెస్ లెక్కల ప్రకారం తెలంగాణా మొత్తం మీద 20 లక్షల బోగస్ ఓట్లున్నాయట. ఆ ఓట్లన్నీ టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేవేనంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఓటర్లజాబితాను సవరించేంత వరకూ ఎన్నికలు జరిపేందుకు లేదంటూ కాంగ్రెస్ వాదించింది. టిఆర్ఎస్ కు వ్యతరేకంగా ఓట్లేస్తారన్న అనుమానం ఉన్నవారి ఓట్లను అధికారులు ఏరేశారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. సరే ఓటర్ల జాబితాను సవరిస్తామని, బోగస్ ఓట్లను ఏరేస్తామంటూ ఎన్నికల సంఘం చెప్పుకోవటంతో ఎన్నికల నిర్వహణకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

అదే అంశం తాజాగా చీఫ్ ఎన్నికల కమీషనర్ ఓపి రావత్ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ మళ్ళీ లేవనెత్తింది. ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితాలో 65 లక్షల బోగస్ ఓట్లున్నట్లు కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపించింది. బోగస్ ఓట్లను నిరూపించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు కూడా కాంగ్రెస్ సవాలు విసిరింది. బోగస్ ఓట్లను గనుక ఏరివేయకపోతే మళ్ళీ కోర్టుకు వెళతామని కూడా హెచ్చరించటం గమనార్హం.

 

 మొత్తం ఓట్లలో నాలుగోవంతు బోగస్ ఓట్లతో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనంటూ కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఓటర్ల జాబితాను సవరించామంటూ ఎన్నికల కమీషన్ కోర్టులో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయటంపై కాంగ్రెస్ మండిపడింది.  ఎన్నికల ప్రక్రియకు చేసిన ఏర్పాట్లపై ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు రావత్ బృందం రాష్ట్రానికి వచ్చింది. ఆ సందర్భంగా గుర్తింపుపొందిన తొమ్మిది రాజకీయ పార్టీలతో సమావేశమైంది. అప్పుడు కాంగ్రెస్ పై ఆరోపణలను చేసింది. మొత్తం మీద బోగస్ ఓట్లతో ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ఆరోపించినట్లు నిజంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే.


మరింత సమాచారం తెలుసుకోండి: