Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 12:53 am IST

Menu &Sections

Search

మతవిషయాల్లో ప్రస్తుతం సుప్రీం తీర్పులు ఎ మాత్రమూ ఆమోద యోగ్యం కావు: జస్టిస్ కట్టూ

మతవిషయాల్లో ప్రస్తుతం సుప్రీం తీర్పులు ఎ మాత్రమూ ఆమోద యోగ్యం కావు: జస్టిస్ కట్టూ
మతవిషయాల్లో ప్రస్తుతం సుప్రీం తీర్పులు ఎ మాత్రమూ ఆమోద యోగ్యం కావు: జస్టిస్ కట్టూ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
national-news-recent-judgements-by-sc-on-religious
సనాతన విశిష్థధర్మాలతో సహస్రాబ్ధాలుగా బిన్నవిభిన్న సాంప్రదాయాలను తనసంస్కృతిలో ఇముడ్చుకుని సజీవ ప్రవాహంలా ముందుకు నడిచే సాంప్రదాయ సదాచార  సంస్కృతి భారత్ స్వంతం. అయితే భారత్ లాంటి అతి ప్రాచీనదేశం దాని సంస్కృతిలో వెలుపెట్టబూనటం రాజ్యాంగ నిర్మిత న్యాయవ్యవస్థలకు తగదు.సంస్కృతి నుంచి పరిణామ క్రమంలో ఉద్భవించిందే భారత ప్రజాస్వామ్యం. ఈ ఆచారవ్యవహారాలు ఎవరికీ ఇబ్బంది కలిగించనంతవరకు సాంఘిక దురాచారాలు కాకుండా మతాచారాలు మాత్రమే ఐతే - వాటిని రాజ్యాంగ వ్యవస్తలు సృజించకపోవటమే మంచిదన్న ప్రముఖ మహిళా న్యాయమూర్తి ఇందూ మల్-హోత్రా మాటలు సర్వదా శిరోధార్యం.  
national-news-recent-judgements-by-sc-on-religious 
అయితే ఇటీవల కాలంలో సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన పలు తీర్పులపై భిన్నా భిప్రాయాలు మనసమకాలీన సమాజంలో అనేక చోట్ల అనేక సందర్భాల్లో వ్యక్త మవుతున్నాయి. తాజాగా సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి, ప్రెస్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ జస్టిస్ మార్కెండయ కట్జూ సైతం ఈ తీర్పులపై ముఖ్యంగా శబరిమల, వివాహేతర సంబంధాల కేసులో ధర్మాసనం నిర్ణయాలను ఆయన ఎత్తిచూపారు. 
national-news-recent-judgements-by-sc-on-religious
తన ఫేస్‌బుక్ పేజ్‌ లో ఒక లేఖను షేర్ చేసిన జస్టిస్ కట్జూ - అందులో జస్టిస్ నారీమన్, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ కౌల్‌ లు ఇటీవల వెల్లడించిన తీర్పు లను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నిజంగా చెప్పాలంటే వెలెత్తి చూపుతూ - తాను గత కొద్ది నెలలుగా విదేశాల్లో ఉన్నానని, కానీ ఇటీవల కాలంలో వెల్లడించిన తీర్పులను అంతర్జాలంలో పరిశీలించానని, ఆ న్యాయమూర్తులను ఉద్దేశిస్తూ - "మీ మెయిల్ ఐడీ లు లేనందున ఈ లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాను" అని అన్నారు. అంతే కాదు "మీకు అడ్డుపడాలనే ఉద్దేశం కాదని, ఒక అగ్రజునిలా సూచనలు చేయాలనేదే నా అభిమతం" అని తెలిపారు. 
national-news-recent-judgements-by-sc-on-religious
"ఈ సూచనలు కూడా మీరు మరింత గొప్ప న్యాయ మూర్తులు కావడానికి ఉపయోగపడాలనేది నా కోరిక" అని ఆయన వ్యాఖ్యానించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 66-ఎ ను జస్టిస్ నారీమన్ కొట్టి వేసిన తీరు అభినందనీయమని అన్నారు. ప్రజాస్వామ్యవ్యవస్థలో అసమ్మతి, భిన్నాభిప్రాయాలు రెండూ సేఫ్టీ-వాల్వ్ అనే ఆలోచనా పూరిత పరికరం లేకపోతే అది ప్రెజర్ కుక్కర్‌ లా పేలిపోతుంది" అని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలు హర్షణీయమని చెప్పారు. 
national-news-recent-judgements-by-sc-on-religious
కానీ, స్వేచ్ఛ, గౌరవం, లైంగిక సమానత్వం అనే విశాలమైన అంశాల దగ్గరకు వచ్చేసరికి దేశ వాస్తవిక సాంప్రదాయక సనాతన పరిస్థితులను కూడా గమనించాలని జస్టిస్ కట్జూ సూచించారు. ఈ సందర్భంగా శబరిమల తీర్పునే ఒక ఉదాహరణగా చూపుతూ ఆసక్తికరమైన జాతికి న్యాయ మూర్తులకు మార్గదర్శనం చేసే వ్యాఖ్యలు చేశారు. 
లైంగిక సమానత్వం అనే సిద్ధాంతం సరైందే కానీ, భారత్‌ లో మత ప్రమేయం జీవన విధానంలో ఎంతగా పాతుకుపోయిందో పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు.


ఇలాంటి తీర్పులు వెస్ట్రన్ ప్రాంతాలైన ఐరోపా, అమెరికా దేశాలకు వర్తిస్తాయి కానీ, మనదేశంలో ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. అయ్యప్ప ఆలయంలోకి ఋతు క్రమం వయసున్న మహిళలను రానివ్వకపోవడమంటే వారిని కించపరచడం కాదని, అది నైష్ఠిక బ్రహ్మచారి అయిన భగవంతుడిపై భక్తులకుండే విశ్వాసమని అన్నారు. ఈ విషయాన్ని సదాచార సంపన్నులైన మహిళలే బలపరుస్తూ సుప్రీం కోర్ట్ తీర్పును నిర్ద్వంధంగా వ్యతిరేకిస్తున్న దరిమిలా జస్టిస్ కట్తూ గారి అభిప్రాయం నూటికి నూరుపాళ్ళూ నిజమే. 


నేను కూడా నాస్తికుడినే, కానీ, ఇతరుల మత విశ్వాసాలు, స్వేచ్ఛను గౌరవిస్తాను. తానైతే ఇలాంటి తీర్పును ఇచ్చేవాడిని కాదని అన్నారు. ఇలాంటి తీర్పుల వల్ల అనేక ఇబ్బందులు ఉత్పన్నమవుతాయని, దీని ప్రభావంతో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిపారు. 
national-news-recent-judgements-by-sc-on-religious
ఈ అంశంలో మీతో విభేదించిన మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా వైఖరే తనకు సరైంది గా అనిపిస్తోందని వివరించారు. ఎందుకంటే గొప్ప వైవిధ్యత కలిగిన మన దేశంలో సాధారణ మత విశ్వాసాలు, ఆచారాల్లో న్యాయమూర్తులు జోక్యం చేసుకోవడం సబబు కాదనే ఆమె వాదనలో నిజముందని అన్నారు. అలాగే వివాహేతర సంబంధాలపై తీర్పు కూడా సరికాదని చురకలంటించారు. వివాహిత మహిళలు ఎవరితోనైనా లైంగిక సంబంధం పెట్టుకోవచ్చనే భావనకు దారితీస్తుందని, భారత్ లాంటి సంప్రదాయక సమాజంలో ఇది తక్షణం ఆమోదయోగ్యం కాద ని వివరించారు.

national-news-recent-judgements-by-sc-on-religious

సాంఘిక దురాచారమైన జల్లికట్టు, కోడిపందాల లాంటి వాటిని నివారించటానికి పూనుకున్న మన న్యాయ వ్యవస్థలు వాటిని ప్రత్యక్షంగా నివారించలేక పోయాయి. కారణం ప్రజలకు ఇష్టమైన నేరాలవి. కాని సనాతన ధర్మాన్ని ఆచరించే హిందూ మహిళలు ఎవరూ ఆశించని ఈ తీర్పు సనాతన ధర్మం విడిచి బాధ్యతలు మరచి పోరే అతి కొద్ది ఇతర మతావలంబకుల కోసమా? ఈ దేశ సంస్కృతి నుంచి ఉద్భవించని వామపక్ష భావాలని ఆచరించే వారికోసమా?  ఈ హిందూ ధర్మంపై తీర్పు.   

national-news-recent-judgements-by-sc-on-religious
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి – బోల్తా కొట్టిన బుల్-బుల్ పిట్ట కేసీఆర్....?
పివి నరసింహారావు - మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలు భారత్ ను బంగారుబాటలో నడిపించాయా?
భారత్‌ ప్రయాణం ఇక నల్లేరు మీద నడకకాదు! ‘అంతర్జాతీయ మందగమనం’ వైపే!
టిఎస్ ఆర్టీసి ఉద్యోగులను ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారన్న కేసీఆరే ‘సెల్ఫ్ డిస్మిస్ అయిపోతారా?’
మోడీ పై దాడి - ఈ రేంజ్ లో మోడీ శతృవులు కూడా కేంద్రంపై దాడి చేయలేదేమో!
పాన్ ఇండియా హీరోగా స్థిరపడ్డ ప్రభాస్ - ప్రాంతీయ హీరోగా మిగిలిపోయిన చిరంజీవి
బాబోర్లకు దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుందట – మరేంచేస్తాం! మనకప్పుడు అధికారమధంలో కళ్ళు కనపళ్ళేదు!
కేసీఅర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందా! ఇదే దానికి చిహ్నం!
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
About the author