Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Wed, Nov 21, 2018 | Last Updated 5:41 am IST

Menu &Sections

Search

జ‌గ‌న్ న‌మ్మిన‌బంటుకు షాక్‌...!

జ‌గ‌న్ న‌మ్మిన‌బంటుకు షాక్‌...!
జ‌గ‌న్ న‌మ్మిన‌బంటుకు షాక్‌...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఏపీలో విపక్షం వైసీపీలో రాజకీయాలు క్షణక్షణానికి మారుతున్నాయి ఎప్పుడు ఎవరికి సీటు వస్తుందో ? జగన్మోహ‌న్‌రెడ్డి ఎవరికి ఎప్పుడు ఎలా చేస్తారో కూడా అర్థం కావడం లేదు. నిన్నటి వరకు జగన్ కు నమ్మినబంటుగా ఉన్నవారు సైతం రేపు నియోజకవర్గాల సమన్వయకర్త బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి తన వెంటే నడుస్తూ తనకు ఎంతో నమ్మకంగా ఉన్న వారిని జగన్ పక్కన పెట్టేస్తున్నారు. వారి స్థానాల్లో ఆర్థికంగా బలమైన వ్యక్తులకు చోటు కల్పిస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు వైసిపి ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉంటూ జగన్ కోసం తన ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకున్న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు సైతం షాక్ త‌ప్పేలా లేద‌ని రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

andhrapradesh-ysrcp-tdp-cm-chandrababu-naidu-ys-ja

2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలరాజు 2012లో జగన్ పార్టీ పెట్టిన వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో 40 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓడినా బాలరాజుకు జగన్ మధ్యలో జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించగా ఆ బాధ్యతలను కూడా ఆయన సమర్థవంతంగా నిర్వర్తించారు వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న బాలరాజు కు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే ఎస్సీ కోటాలో మంత్రి పదవి వస్తుందని కూడా అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు నియోజవర్గంలో బాలరాజుకు ఎంపీగా వ్యతిరేక వర్గం తయారయ్యి ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తే తాము పని చేసేది లేదని బాలరాజు ఓడించి తీరుతామని శ‌పథాలు చేస్తున్నారు.

andhrapradesh-ysrcp-tdp-cm-chandrababu-naidu-ys-ja

జ‌గ‌న్ బాబాయ్‌, ఒంగోలు ఎంపీ వై వి సుబ్బారెడ్డి సైతం బాలరాజుకే సీటు ఇస్తామని... ఆయనను గెలిపించాలని చెబుతున్నా బాలరాజును వ్య‌తిరేకిస్తోన్న‌ వర్గం మాత్రం ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు బాలరాజును వ్యతిరేకిస్తున్న వర్గం రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతుండ‌డంతో జగన్ ఆయ‌న‌కు చివ‌రిగా సీటు ఇస్తారా ? లేదా అన్నది సందేహంగా మారింది. ఏదేమైనా నిన్నటి వరకు జగన్ కు నమ్మినబంటుగా ఉన్న బాలరాజు పరిస్థితి ఇప్పుడు ఇలా రివ‌ర్స్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో బాలరాజుకు సీటు ఇస్తారా ? లేదా ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన తప్పించి మరో వ్యక్తికి ఇస్తారా ? బాలరాజుకు మ‌రో ఆప్ష‌న్‌ చూపిస్తారా ? అన్నది చూడాల్సి ఉంది.

andhrapradesh-ysrcp-tdp-cm-chandrababu-naidu-ys-ja

జ‌గ‌న్ పోల‌వ‌రం వైసీపీలో జ‌రుగుతోన్న ప‌రిణామాలు కంట్రోల్ చేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఇక్క‌డ వైసీపీ ఓడే ఛాన్సులే ఎక్కువ‌గా ఉన్నాయి. రాష్ట్ర వైసీపీలో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో బాలరాజును పోలవరం లో తప్పిన పెద్ద ఆశ్చర్య పడాల్సిన పని లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


andhrapradesh-ysrcp-tdp-cm-chandrababu-naidu-ys-ja
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
About the author

I describe myself with the word peculiar because I think in different ways than what other people usually think and I consider myself a cheerful and optimist girl, I usually have a positive attitude facing life. Academically I'm interested in writing specifically news and short stories. I'd like to revolve around writing which I fondly called The art of words. I have found enjoyment in reading and solving puzzles too.