అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ప్రధానమైన హాయ్ ల్యాండ్ పై నారా వారి చినబాబు లోకేష్ కన్నేశారా ? అవుననే అంటున్నారు బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు. అగ్రిగోల్డ్ కు చెందిన వేల కోట్ల రూపాయల ఆస్తుల్లో హాయ్ ల్యాండ్ చాలా కీలకమైనది. ఎందుకంటే, అగ్రిగోల్డ్ వివాదం మొదలైనప్పటి నుండి చాలా ఆస్తులపై మంత్రులు, తెలుగుదేశంపార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కన్నేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నదే. ఆస్తులు కొనుగోలు వ్యవహారంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీమంత్రి రావెల కిషోర్ బాబు తదితరుల పేర్లు వివాదాల్లో బాగా నలుగుతున్న విషయం  తెలిసిందే.

 

వీళ్ళ పేర్లతో పాటు నారా లోకేష్ కన్ను ఏకంగా హాయ్ ల్యాండ్ పైన పండిందనే ఆరోపణలకు కొదవలేదు. లోకేష్ తో పాటు ఓ ప్రముఖ మీడియా యాజమాన్యంపైన కూడాఈ ఆరోపణలున్నాయి. వాళ్ళ దారికి రకపోవటంతోనే అగ్రిగోల్డ్ వివాదాన్ని రేపారనే ప్రచారం కూడా జరుగుతోంది లేండి. సరే ఏదేమైనా కానీ మొత్తానికి అగ్రిగోల్డ్ సంస్ధ మూతపడేంత వరకూ ప్రభుత్వానికి నిద్రపట్టలేదు. ఆ సంస్ధ ఆస్తుల్లో హాయ్ ల్యాండ్ చాలా ప్రధానమైనది. అందుకనే పలువురి దానిపై కన్నేశారట.

 

తాజా ఆరోపణల్లో జివిఎల్ అదే మాటను చెబుతున్నారు. హాయ్ ల్యాండ్ ఆస్తులను చవకగా కొట్టేసే కుట్ర జరుగుతోందంటూ జివిఎల్ పెద్ద బాంబే పేల్చారు. ఆ కుట్రలో పాత్రదారులైన వారు లోకేష్, మంత్రులతో పాటు అధికారులైనా సరే జైలుకెళ్ళక తప్పదంటూ హెచ్చరించారు. జైలు అంటూ జివిఎల్ హెచ్చరిస్తున్నారంటే హాయ్ ల్యాండ్ చేతులు మారటానికి తెరవెనుక ఏదన్నా ప్లాన్ జరుగుతోందేమో ? పైగా ఈ విషయమై చర్చకు తాను సిద్ధమంటు సవాలు విసరటం చూస్తుంటే జివిఎల్ దగ్గర పక్కా ఆధారాలున్నాయా అన్న అనుమానం కూడా వస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: