Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, Jan 21, 2019 | Last Updated 4:46 pm IST

Menu &Sections

Search

వీడిన సస్పెన్స్ - జనసేనలో "మనోహర్" ఎంట్రీ అందుకే..!!!

వీడిన సస్పెన్స్ - జనసేనలో  "మనోహర్"  ఎంట్రీ అందుకే..!!!
వీడిన సస్పెన్స్ - జనసేనలో "మనోహర్" ఎంట్రీ అందుకే..!!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఎన్నికల సమయంలో వివిధ పార్టీలలోకి నేతలు వస్తుంటారు వెళ్తుంటారు.. పార్టీ అధినేత సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటారు..అధినేతలు కూడా నేతలు ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం సాదరంగా ఆహ్వానం తెలిపి వారి వారి నియోజకవర్గాలలో పార్టీని ముందుకు తీసుకెళ్ళండి అంటూ సూచిస్తారు..ఇదంతా అన్ని పార్టీలలో కామన్ గా జరిగే అంశమే అయితే జనసేనలో మాత్రం కొంచం డిఫరెంట్ గా జరుగుతోంది..జనసేన పార్టీలో కూడా గత కొంతకాలంగా వివిధ పార్టీలకి చెందిన నేతలు ప్రజా నేతలు ఎంతో మంది  పవన్ సమక్షంలో చేరారు వారిలో పేరున్ననేతలు.. జనాదరణ ఉన్న నేతలు.. ప్రజలకు సుపరిచితులైన నేతలు ఎంతో మంది ఉన్నారు కానీ..

 ap-politics-telangana-politics-ap-political-update

ఏ నాయకుడికి దక్కని పవన్ ఆదరణ, పార్టీలో ప్రాధాన్యత కేవలం  నాదెండ్ల మనోహర్ కు మాత్రమే ఎందుకు దక్కుతోంది.. పార్టీలో ఆయన చేరిన నాటినుంచీ తన పక్కనే పవన్ ఉంచుకోవటం, తాను ఎక్కడికి వెళితే అక్కడకు తీసుకెళ్లటం, చివరకు భారీగా ఏర్పాటు చేసిన కవాతు సభలోనూ పవన్ తన పక్కన నాదెండ్లను ఉంచటం అందరిని ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..పవన్ ఎందుకు నాదెండ్ల కి అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే..దానికి రీజన్ లేకపోలేదు..


 ap-politics-telangana-politics-ap-political-update

గడించిన కాలంలో జనసేన అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కనిపిస్తున్నాడు అంటూ పవన్ వ్యతిరేక వర్గం అంతా సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు..పవన్ వన్ మ్యాన్ షో చేస్తున్నాడు, అహంకారి అంటూ మాటల తూటాలు పేల్చారు. అయితే వాస్తవానికి పవన్ కు రాజకీయ అనుభవం తక్కువ కావడంతో తన భావజాలానికి తగ్గట్టుగా మనోహర్ ఉండటం ఆయన వ్యక్తిత్వం కూడా పవన్ కళ్యాణ్ కి దగ్గరగా ఉండటంతో పాటుగా విధానపరమైన విషయాలని చర్చించడంలో మనోహన్ సాయం తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్...అదే నాదెండ్ల మనోహర్ ను పవన్ తన పక్కన ఉంచుకోవటానికి కారణంగా చెప్తున్నారు...ఇక్కడి వరకూ బాగానే ఉంది కానీ మరి పవన్ కళ్యాణ్ తీరుతో  జనసేనకి జెండా ముందు నుంచీ మోస్తున్న పవన్ కోటరీకి ఈ విషయం మింగుడు పడటం లేదనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

 


ap-politics-telangana-politics-ap-political-update
5/ 5 - (1 votes)
Add To Favourite