తిమ్మిమి బమ్మి బమ్మిని తిమ్మిచేసి ఎలాగైనా అధికారాన్ని తన పిడికిట్లో ఉంచుకోవటానికి సకల ప్రజాస్వామిక నిబద్దతలను, నిజాయతీని, సామాజిక విలువలకు తిలోదకా లిచ్చే వాళ్లలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారు. రాజకీయ అధముల్లో ఈయన ప్రధముడని  సందేహం లేకుండా చెప్పొచ్చు. 

 
ఉభయ రాష్ట్రాల్లొ పంచాయతీలకు చంద్రగ్రహణాలు పట్టాయి. అందుకే సర్పంచులు కోర్ట్ తలుపుతట్టిన దరిమిలా ప్రభుత్వాని కి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్‌‌ లో గడువు ముగిసినప్పటికీ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన విధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెం.90 ని జారీ చేసింది. స్పెషల్ ఆఫీసర్లుగా చంద్రబాబు ఆదీనంలో పనులు చేసే క్రింది స్థాయి  నియమిస్తోందని.. తక్షణం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మాజీ సర్పంచులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు శ్రద్దగా విని విచారణ జరిపింది. 
Image result for panchayat elections high court judgement in AP
మాజీ సర్పంచుల వాదన నిబద్దతతో కూడి  ఉండటం వారి ఆలోచనలు చట్టప్రకారం ఉండటంతో  ఏకీభవించిన హైకోర్టు, స్పెషల్ ఆఫీసర్ల పాలనను విధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిర్ద్వందంగా కొట్టేవేసింది.. దానితో పాటు మూడు నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
Image result for iddaru chandrulu
ఏపీ, తెలంగాణల్లోని గ్రామాల్లో సర్పంచ్‌ ల పాలన ఈ ఏడాది ఆగస్ట్ 1న ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాదికారుల పాలన కొనసాగుతోంది. అయితే తెలంగాణ లోని ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ నేత శ్రవణ్ వేసిన పిటిషన్‌ పై విచారణ జరిపిన హైకోర్టు మూడు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.. తాజాగా ఇప్పుడు ఏపీ విషయం లోనూ ఇదే తరహా తీర్పును వెలువరించింది. 


అంటే జనాలకు అప్రజాస్వాముల పాలన అందించటంలో ఇద్దరు చంద్రులూ అనుమానంలేకుండా అధమాతి అధములే అంటున్నారు ప్రజలు మాజీ సర్పంచులు. వీరిద్దరు సర్పంచుల పాలన లేకుండా గ్రామాలను తమ అదుపాఙ్జలలో ఉంచు కోవటానికి క్రిందిస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులను నియమించుకోవటమే వారిలోని నియంతృత్వ పోకడలు జనాల కు కనిపిస్తున్నాయని అంటున్నారు విశ్లేషకులు.

Image result for panchayat elections high court judgement in AP

ఇంతకూ పంచాయితీ ఎన్నికల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఆసక్తి  ప్రదర్శించటం లేదన్న విషయంలోకి వెళితే  ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండటం, ఎన్నికలు జరిగితే అధికారపక్షానికి షాకిచ్చే ఫలితాలు వస్తే - దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికల మీదపడే వీలుంది. అందుకే, సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ స్పెషల్ ఆఫీసర్లతో బండి లాగించాలని బాబు సర్కారు భావించినట్లు చెబుతారు.


దీనికి బ్రేకులు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలతో ఇప్పుడు పంచాయితీ ఎన్నికల్ని నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: