అమ్మలగన్న అమ్మ విజయనగరం గ్రామ దేవత శ్రి పైడి తల్లి అమ్మవారి సిర్మాను సంబరాలు ఈ రోజు ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన ఉత్సవాలు సాయంత్రం అయిదు గంటలకు పూర్తి అయ్యాయి. సిరిమాను రధాన్ని అధిరోహించిన ప్రధాన పూజారి ఆలయం నుంచి మహారాజా కోట వద్దకు ముమ్మారు తిరగడంతో సిరిమాను ఉత్సవం పూర్తి అయింది.


అమ్మవారే అలా ఆవహిస్తారు :


సిరిమానును అధిరోహించిన ప్రధాన పూజారిపై అమ్మవారు ఆవహించి ఉంటారని, ఆ విధంగా వచ్చినా ఆయనను దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల విశ్వాసం. దాదాపుగా రెండు వందల ఏళ్ళ పైబడి చరిత్ర గలిగిన శ్రీ పైడితల్లి అమ్మవారు ఉత్తరాంధ్ర భక్తులకు కొంగు బంగారంగా ఉంటున్నారు.

 

వేలాదిగా వచ్చిన జనం :

 

అమ్మవారి ఉత్సవాలకు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వారి కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రముఖులు విచ్చేశారు. ఆలయ వంశపారంపర్య ధర్మ కర్త, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నారు.

 

 అలాగే విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు, మరో మంత్రి సుజయక్రిష్ణ రంగారావు కూడా అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఏడాదికి ఒకమారు వచ్చే అమ్మవారి జాతర, సిరిమాను ఉత్సవం విజయనగరానికి కొత్త కాంతులను తీసుకువస్తుంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: