దేశాన్ని ఏలుతున్న బీజేపీ ఏపీలో మాత్రం మంచి నీళ్ళు తాగుతోంది. ఎన్నికలు హటాత్తుగా వస్తే మొత్తం సీట్లకు దేముడెరుగు సగానికి సగమైన సీట్లకు అభర్ధులు దొరుకుతారా అని బెంగటిల్లే పరిస్థితి ఆ పార్టీది. అయినే బయటకు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. 


కోటలు దాటేస్తున్న మాటలు :


ఏపీలో చంద్రబాబు సర్కార్ కూలిపోతుంది. 2019లో వచ్చేది మా సర్కారేనని బీజేపీ తెగ మాట్లాడుతోంది. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్ ఏపీకి చెందిన వారే. మరి ఆయన ఈ మాటలు అన్నారంటే బీజేపీకి ఏదో ధీమా అయినా ఉండాలి, లేక వెనక నుంచి మద్దతు ఇచ్చే శక్తులైనా ఉండాలి. ఏదీ కాకుండా రాం మాధవ్ ఉత్తగా మాట్లాడరుగా.


వైసీపీ మీద ఆశలా :


ఏపీలో బీజేపీకి పొత్తు ఎవరితో ఉంటుందన్న చర్చ మళ్ళీ మొదలైంది చూడబోతే టీడీపీ కానే కాదు, నిన్ననే సున్నం పెట్టుకున్న పార్టీ అది. ఇక మిగిలింది వైసీపీ, జనసేన. ఈ రెండిటిలో కూడా ఫోర్ ఫ్రంట్ లో ఉన్నది వైసీపీ మాత్రమే. అయితే జగన్ బీజేపీతో కలుస్తామని ఎక్కడా చెప్పడంలేదు. పైగా ఆ పార్టీ నేతలు ఒంటరిగానే పోటీ అంటూ పదే పదే చెబుతున్నారు. మరి ఏ నమ్మకం లేకుండానే రాం మాధవ్ భారీ స్టేట్మెంట్ ఇస్తారా


ఆ మూడు పార్టీలు కలసి :


ఇక టీడీపీ ప్రతి రోజు  ప్రచారం చేతున్నట్లుగా జనసేన, వైసీపీ, బీజేపీ కలసి ఏమైనా కూటమిగా ఏర్పడవచ్చునేమో. జనసేన, వైసీపీ కూడా ఎన్నికల ముందు కంటే తరువాతనే కలిసేందుకు వీలుంది. ఆలాగే బీజేపీని కూడా జగన్ ఫలితాలు వచ్చిన తరువాతనే చేరదీసే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంతే తప్ప ఇప్పటికిపుడు కాదు.


దాడి చేస్తున్న టీడీపీ:


రాం మాధవ్ ఇలా అన్నారో లేదో టీడీపీ తమ్ముళ్ళకు కొత్త ఆయుధం ఒకటి దొరికేసింది. మేము ఇంతకాలం చెబుతున్నదే జరుగుతోంది. ఏపీలో ఆ రెండు పార్టీలూ ఒక్కటి అవుతున్నాయి.  ఏపీలో కొత్త ప్రభుత్వం మాదీ అని ధీమాగా బీజేపీ నాయకుడు చెప్పాడంతేనే పొత్తులు ఖరార్ అయిపోయినట్లు అంటూ బుద్దా వెంకన్న లాంటి లీడర్లు చెప్పేస్తున్నరు. మరి దీన్ని వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: