చంద్రబాబునాయుడు మాటలు, చేతలు విచిత్రంగా ఉంటున్నాయి. ఎవరో ఏదో అంటే వెంటనే ఆ మాటలను లేదా చేష్టలను తనకు అనుకూలంగా మార్చేసుకుని ప్రచారం చేసేసుకుంటున్నారు. తాజాగా క్రికెట్ ప్లేయర్ విరాట్ కొహ్లీ ట్వీట్ ఉదంతమే నిదర్శనం. వెస్టిండీస్ తో వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేందుకు విశాఖపట్నం చేరుకున్న విషయం  అందరకీ తెలిసిందే. విశాఖపట్నం వచ్చిన సందర్భంగా కొహ్లీ ఓ ట్వీట్ చేశారు. దాన్ని పట్టుకుని చంద్రబాబు సొంతడబ్బా మొదలుపెట్టేశారు.

 

తన ట్విట్టర్ ఖాతాలో విశాఖపట్నం అద్భుతమైన నగరమని, ఇక్కడి రావటం తనకెంతో ఇష్టమని కొహ్లీ తాజాగా ట్వీట్ చేశారు. దానికి వెంటనే చంద్రబాబు స్పందిచేశారు. విశాఖపట్నం నగరం ప్రపంచం ప్రేమించే గమ్యస్ధానం అవుతున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. విశాఖలో ఈరోజు జరుగనున్న రెండో వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లో కొహ్లీ సేన విజయం సాధించాలంటూ చంద్రబాబు ట్వీట్ పెట్టారు.

 

భారత జట్టు విజయం సాధించాలని ట్వీట్ పెట్టటం వరకు ఓకే. కానీ విశాఖనగరం ప్రపంచం ప్రేమించే గమ్యస్ధానం అవుతున్నదని చెప్పుకోవటంలో చంద్రబాబు ఉద్దేశ్యం ఏమిటి ? తన హయాంలోనే విశాఖపట్నం అంతర్జాతీయ స్ధాయికి చేరుకున్నదని చెప్పుకోవాలన్న ప్రచార యావే కనబడుతోంది. క్రికెటర్లలో ఒక్కొక్కరికి ఒక్కో గ్రౌండ్ అచ్చొస్తుంది. ఎన్నో సెంటిమెంట్లుంటాయి. విశాఖనగరానికి మించిన ఎన్నో నగరాల్లో కొహ్లీ మ్యాచులాడుంటారనటంలో సందేహం అక్కర్లేదు. ఏదో అభిమానులను ఆలరించటానికి కొహ్లీ ఓ ట్వీట్ పెట్టుంటారు. దానికి వెంటనే చంద్రబాబు స్పందిచేయటం, విశాఖనగరం ప్రపంచం ప్రేమించే గమ్యస్ధానం అవుతోందని చెప్పుకోవటం ఆశ్చర్యంగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: