తిరుమల తిరుపతి వెంకన్న బరువుని, పరువుని కూడా వెలకట్టే మేధావులు పుట్టుకొచ్చారు. అపుడెపుడో త్రేతాయుగంలో స్వామి వారి క్రిష్ణావతారం ఘట్టంలో తులాభారం సీన్ ఒకటి ఉంది. రుక్మిణి దేవి తులసీదళం వేసి స్వామి పరువు, బరువు తూచింది. అంటే భక్తికి తప్ప స్వామి మరి దేనికి తూగడని ఆ పురాణ సారం.


200 కోట్లకు దావా :


మరి అటువంటి స్వామి పరువు 200 కోట్ల రూపాయలు అని ఎలా అంచనా వేస్తారు. స్వామి వారి గురించి ఏమని తెలుసని అలా దావా వేస్తారు. పోయింది టీటీడీ అధికారుల పరువా, స్వామి పరువా. లేకా తమకూ స్వామికి తేడా లేదని అనుకుంటున్నారా. ఇది చాల చిత్రమైన వాదన‌గా ఉంది. అధికారులు తప్పులు చేస్తున్నారని కదా ఆరోపణలు వచ్చింది.  టీటీడీ  అపసవ్యంగా వ్యవహరిస్తోందని  కదా నిందలు వేసింది.


రాజకీయమా :


నిజానికి ఆలయ ప్రధానాచర్చకునిగా ఒకనాడు పనిచేసిన రమణ దీక్షితులు ఏమన్నారు. అక్కడ ఆగమ శాస్త్ర విరుధ్ధంగా పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి ఏమన్నారు. ఆయన సైతం ఇవే ఆరోపణలు చేస్తూ ఆభరణాలు పోయాయని, అవి ప్రభుత్వ పెద్దల వద్ద ఉన్నాయని చెప్పారు. సీబీఐ విచారణను కూదా కోరారు. మరి దానికీ, స్వామి వారి పరువునకు సంబంధం
ఏంటో.


టీటీడీ ఖర్చుతో:


ఈ మొత్తం దావాను నడించినడానికి టీటీడీ దాదాపుగా రెండు కోట్ల రూపాయకు ఖర్చు చేస్తోంది. ఈ మొత్తం ఎవరిది, భక్తులు హుండీల్లో వేసినది కాదా. మరి భక్తుల నమ్మకంతో రాజకీయాలూ దావాలూ ఏంటి, తప్పులు జరిగితే దిద్దుకోవాలి. లేదు తాము సుద్ద పూసలు అయితే వ్యక్తిగతంగా కోర్టుకో కేసులు వేయాలి తప్ప మధ్యలో తిరుపతి వెంకన్నను, ఆయన పరువును లాగడం ఏంటో. పైగా రెండు వందల కోట్లట. ఎవరు లెక్కించారు స్వామికి ఇంతే పరువు ఉందని. అసలు స్వామి రూపం అనంతం, ఆయన లీలలు అపూర్వం, అటువంటి  స్వామి పరువు మాత్రం రెండు వందల కోట్లా, నిజంగా ఇపుడు కదా స్వామి పరువు పోతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: