సీబీఐ మాజీ జేడీ  లక్ష్మీనారాయణ రాజకీయ అరంగేట్రానికి ఎంతో సమమయం లేదా. అతి త్వరలోనే ఈ మాజీ జేడీ కొత్త పార్టీలో ఏపీ ప్రజల ముందుకు రానున్నారా..?? భవిష్యత్తులో జేడీ పెట్టబోయే పార్టీకి జనసేనుడు తోడుగా ఉండనున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి...తాజాగా జేడీ చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్సనం అవుతున్నాయి..ఒక వేళ ఇదే గనుకా జరిగితే జనసేన మరింత బలపడం ఖాయం అంటున్నారు పరిశీలకులు..అసలు జేడీ ఏమన్నారు..కొత్త ప్రతీ పెడుతారా లేదా అనే వివరాలలోకి వెళ్తే..

 Image result for janasena pavan klayan jd lakshmi naarayana

నీతి , నిజాయితీకి మారుపేరుగా ఎంతో గుర్తింపు పొందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకి  ఏపీలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అధికారిగా ఉన్న సముయంలోనే ఆయన్ని పలు విద్యాసంస్థలు ఆయన ప్రసంగాల కోసం, మోటివేషన్ స్పీచ్ కోసం ఆహ్వానించేవారు..క్రమక్రమంగా జేడీ విద్యార్ధులకి అలాగే యువతకి, ఉద్యోగులకి ఆరాధ్యుడు అయిపోయారు. సేవాభావం తో ఎప్పుడు ఈలోచించే జేడీ తన పదివికి ఇంకా కొన్నేళ్ళ సర్వీసు ఉండగానే  స్వచ్చందంగా రాజీనామా చేసేశారు..

 Image result for janasena pavan klayan jd lakshmi naarayana

ఆ తరువాత జేడీ ముఖ్యంగా రైతుల 13 జిల్లాలో ఉండే రైతుల సాధక భాదలు తెలుసుకున్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను రాజకీయ ఆరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు ఎలాంటి వ్యక్తులు సంస్థలు ముందుకు వచ్చినా సరే వారితో కలిసి పని చేస్తానని తెలిపారు...ఇదిలాఉంటే జేడీ తాజాగా తన రాజకీయ జీవితంపై సంచలన కామెంట్స్ చేశారు.. కొత్త పార్టీ స్థాపించాలా? లేక వేరే పార్టీలో చేరాలా? అనే విషయంపై ఆలోచిస్తున్నానని ఇప్పటికయితే తనను ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఆహ్వానించాయని లక్ష్మీనారాయణ తనకు వచ్చిన ఆఫర్లను జేడీ తెలిపారు.

 Image result for janasena pavan klayan jd lakshmi naarayana

అయితే ప్రస్తుతానికి ఏపీ ని విడిచి బయటకి వెళ్లనని జేడీ స్పష్టం చేశారు..ఏపీలో టీడీపీ ,వైసీపీ బలంగా ఉందంటూ ఆ పార్టీలకి వెళ్ళే చాన్సే లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీ పై జేడీ స్పందన మాత్రం తెలియచేయలేదు. దాంతో జేడీ కొత్త పార్టీ పెడుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు జేడీ ఒక వేళ పార్టీ పెట్టినా భవిష్యత్తులో టీడీపీ ,వైసీపీలతో కలిసే అవకాశమే లేదు ఎందుకంటే ఇప్పటికే వైసీపీ, టీడీపీ పార్టీలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి బీజేపీ టీడీపీ అవినీతి పార్టీ అనే కోణంలో ఇప్పటికే పార్టీ పరువుని బజారుకు ఈడ్చింది. ఇక వైసీపీ అధినేతని గతంలో జేడీనే దగ్గర ఉందిమరీ జైలుకు పంపారు సో ఈ పరిస్థితులలో జేడీ ఎట్టి పరిస్థితుల్లో జేడీ ఈ రెండు పార్టీలకి మద్దతు తెలుపరు. ఇక ఏపీలో ఎటువంటి మచ్చా లేకుండా క్లీన్ గా ఉన్న పార్టీ జనసేన ఒక్కటే. దాంతో జేడీకి జనసేన తోడు తప్పక కావాల్సిందే...ప్రస్తుతానికి జేడీ ఈ పొత్తుల విషయంలో సైలెంట్ గా ఉన్నా త్వరలోనే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: