వైఎస్ జగన్ ది వజ్ర సంకల్పం. ఆయన పట్టుదల ముందు అన్నీ తలవంచుతున్నాయి. ఇడుపులపాయలో పడిన తొలి అడుగు కోటానుకోట్ల అడుగులై ఇప్పటికి  పదకొండు జిల్లాలను ఏపీలో చుట్టేసింది. విజయనగరం జిలాల్లో ఈ నెలాఖరులో జగన్ పాదయాత్ర ముగుస్తుందనగా ఇదే జిల్లాలో రెండు హిస్టారికల్  మైల్ స్టోన్స్ జగన్ క్రియేట్ చేశారు.


కీలకమైన  ఘట్టం:


జగన్ తన పాదయాత్రలో కీలకమైన ఘట్టంగా 3,200 కిలోమీటర్ల మైలు రాయిని ఈ రోజు దాటారు. ప్రజాసంకల్పయాత్రలో  భాగంగా ప్రస్తుతం విజయనగరంలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర సాలూరు మండలం, బాగువలస వద్ద 3,200 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ మైలురాయికి గుర్తుగా బాగువలస వద్ద జననేత జగన్‌ కానుగు మొక్క నాటారు. దీంతో అక్కడి ప్రజలు, వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.


ఎస్ కోటలో ఆ రికార్డ్:


జగన్ విజయనగరం జిల్లాలోకి అడుగుపెడుతూనే ఎస్ కోట దగ్గర 3,000 కిలోమీటర్ల మైలు రాయిని దాటారు. ఆ రోజు చారిత్రాత్మకమైన దినంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇపుడు సాలూరులో మరో మైలు రాయి పడింది. ఇదిలా ఉండగా జగన్ పర్యటనలో ఎక్కువగా నిరుద్యోగులు, పేదలు, మహిళలు పాలుపంచుకున్నారు. తమ బాధాలను చెప్పుకుని స్వాంతన పొందారు.


 అందరికీ భరోసా ఇచ్చిన జగన్ తొందరలో రాజన్న రాజ్యం వస్తుందని, అంతా బాగుంటారని చెబుతూ ముందుకు సాగడం విశేషం. ఇక్కడ మరొకటి కూడా ఛెప్పాలి. విజయనగరం జిల్లా టీడీపీకి నిన్నటి వరకూ కంచుకోట, ఇపుడు జగన్ పాదయాత్రలో వెల్లువలా ఉప్పొంగుతున్న జనంతో గాలి ఇటు వైపు మళ్ళుతోందనిపిస్తోంది. మొత్తానికి పాదయాత్రతో జగన్ వైసీపీకి మంచి ఫలితాలు తెచ్చేలా పరిశ్రమిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: