పవన్ కళ్యాణ్ కు కొంచెం తిక్కుంది. కానీ దానికొక లెక్కుంటుందని తన అభిమానులు అంటుంటారు. లెక్కేమో కానీ ఇప్పుడు అందరికీ తిక్క మాత్రం కనిపిస్తుంది.అదిగో తెలంగాణలో పోటీ అన్నావు.. ఇదిగో పొత్తు అన్నావు.. చర్చలు అన్నావు... గెలిచే సీట్లలో పోటీ అన్నావు.. 24 సీట్లు అని నంబర్ కూడా చెప్పావు.. అంత హడావుడి చేశాకా.. ఇప్పుడు తెలంగాణలో పోటీ విషయంలో మాత్రం ఉలుకూపలుకూ లేదు. మొన్న 15వ తేదీతోనే పోటీ విషయంలో నిర్ణయం ప్రకటిస్తాను అన్నావు.


నీ మీద ఆశలు పెట్టుకుని.. ఒక ఎర్ర పార్టీ ఎదురుచూసీ చూసీ అలసిపోయింది. పాపం ఆ పార్టీ నీ మీద ఆశలతో మహాకూటమి వైపు కూడా చూడలేదు. అదేమంటే పవన్ కల్యాణ్ ఉన్నాడు.. అతడితో కలిసి పోటీ చేసేస్తాం.. దున్నేస్తాం.. అని ఆ పార్టీ నేతలు గట్టిగా చెప్పుకున్నారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావొచ్చు.. అనే ఊహాగానాల దశ నుంచి నీ మీదే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు ఏం చేయాలో దానికి తెలియడం లేదు. వెళ్లి మహాకూటమి తలుపు తట్టేదా... లేక నిన్ను నమ్ముకున్నందుకు నీలాగే తెలంగాణలో పోటీ నుంచి విరమించుకునేదా అనేది ఆ పార్టీ నేతలకు అర్థంకావడం లేదు.


ఇప్పుడేమో పవన్ కల్యాణ్ పంచాయతీ ఎన్నికలు కావాలని అంటున్నాడు. వాటిని తక్షణం నిర్వహించాలని అంటున్నాడు. పంచాయతీ ఎన్నికలు నిర్వహిచడం అయితే అవసరమే.. ప్రెసిడెంట్ల పదవీకాలం ముగిసింది కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం వీటిని నిర్వహించడానికి ముందుకు రావాల్సింది. అయితే బాబు

తటపటాయిస్తున్నాడు.ఇలాంటి నేపథ్యంలో పవన్ సవాళ్లు విసురుతున్నాడు. పంచాయతీ ఎన్నికలు అంటూ పలవరిస్తున్నాడు. తెలంగాణ ఎన్నికల విషయంలో ధూంధాం అని ఇప్పుడు మళ్లీ ఏపీ పంచాయతీ ఎన్నికలు కావాలంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: