దీపావళి సందడి ప్రారంభమయ్యింది. తారాజువ్వలు తారాపథంలోకి దూసుకుపోవడానికి రెడీ అవుతున్నాయి. రాకెట్లు రయ్‌మని ఎగిరిపోవడానికి రెక్కలు తొడుక్కుంటున్నాయి. చిచ్చు బుడ్డులు చిందులేయడానికి ముస్తాబవుతున్నాయి.  భూ చక్రాలు గిరిగిరా తిరిగేయడానికి భలే ముచ్చటపడుతున్నాయి. టపాసులు  పేలిపోవడానికి టైమ్‌ను కౌంట్‌ చేసుకుంటున్నాయి. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ పండగని దేశమంతా కలిసి జరుపుకుంటారు. పంటలు పండే రుతువు అయిపోయిందనటానికి గుర్తుగా మరియు చలికాలం ప్రారంభాన్ని ఈ పండగ సూచిస్తుంది.

Image result for diwali

ఈ పండగ ముఖ్యసారం చెడుపై మంచి గెలవటం. ఎప్పుడు వెలిగిస్తారా అని అగ్గిపెట్టెలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. దీపావళికి అసలు టపాసులు ఎందుకు కాలుస్తారు? ఈ డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే.. రాముడు.. రవాణాసురుడిని చంపాడని, సత్యభామ నరకాసురుడిని అంతమొందించిందని అందుకే టపాసులు కాలుస్తుంటారని పెద్దవాళ్లు చెబుతుంటారు. అయితే.. ఇందులో అసలు నిజం లేదు. ఎందుకంటే.. 1923కి ముందు మన దేశంలో అసలు టపాసులే లేవు. ఆ రోజుల్లో దీపావళి అంటే కేవలం దీపాలను వెలిగించే వారు.  మనకు టపాసులు కాల్చడం  పరిచయం చేసింది నాడర్ బ్రదర్స్. అసలు ఏవరీ నాడర్ బ్రదర్స్? ఏమిటా కథ?  


సాధారణంగా టపాసులు అనగానే శివకాశీ బాంబులు గుర్తుకు రావడం సహజం. ఈ శివకాశీ.. తమిళనాడు రాష్ట్రంలోని విరుదునగర్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. ప్రస్తుతం మనదేశంలో ఎక్కడికైనా టపాసులుఈ పట్టణం నుంచే సరఫరా చేస్తారు.  ఇక టపాసులు రావడానికి మూలకర్తలు నాడర్ బ్రదర్స్ అని చెబుతారు.  మన దేశంలో మొట్టమొదటి బాణాసంచా కర్మాగారం కోల్ కత్తాలో ప్రారంభమైంది. శివకాశీ పట్టణానికి చెందిన  పి.అయ్యన్ నాడర్, షణ్ముగ నాడర్ అనే ఇద్దరు అన్నదమ్ములు కలకత్తా వెళ్లి అక్కడ టపాసుల తయారీ కేంద్రంలో పనిచేశారు.

Related image

 ఆ తర్వాత వారే సొంతంగా అగ్గిపెట్ట కంపెనీ మొదలు పెట్టారు. ఎనిమిది నెలలకు జర్మనీ నుంచి యంత్రాలను దిగుమతి చేసుకుని అనిల్ బ్రాండ్, అయ్యన్ బ్రాండ్ పేరుతో బాణాసంచా ఉత్పత్తిని ప్రారంభించారు. కాలక్రమానా కోల్ కత్తాలోని టపాసుల కేంద్రం శివకాశీకి తరలించారు.అయితే 1940 సంవత్సరంలో పేలుడు పేలుడు పదార్థాల చట్టంపై ఏర్పాటైన బాణా సంచా కర్మాగారాల  సెన్సింగ్ విధానం, బాణాసంచా నిలువ, అమ్మకాలపై నియంత్రణ మొదలయ్యింది.  ఇక భారత దేశంలో అత్యధికంగా బాణా సంచా దిగుమతి అయ్యే ప్రదేశం శివకాశిగా చెబుతారు.  శివకాశీలో 8వేలకు  పైగా బాణాసంచా ఉత్పత్తి చేసే పరిశ్రమలున్నాయి. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే బాణాసంచాలో 90 శాతం ఇక్కడి నుంచే సరఫరా అవుతుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: