Image result for rehana fathima
విచ్చల విడితనం ఎప్పుడూ అభ్యంతరమే. సమాజానికి శ్రేయోదాయకం కాదు. మనం సమాజంలో నివసించేటప్పుడు లేదా మతావలంబన విషయంలో మన బాధ్యత మరచి ఎన్నడూ ప్రవర్తించ కూడదు. రెహానా ఫాతిమా అనే ముస్లిం మతావలంబకురాలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆమె బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగిని, ఉద్యమకారిణి కూడా! ఆమెను ఆమె డిపార్ట్మెంట్ వారు బదిలీ వేటేశారు. ఆమెను నిన్న మంగళవారం కొచ్చిలోని 'పళరివట్టమ్' టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌‌ కు బదిలీ చేశారు.


ఇప్పుడు ఆమె పనిలో ఎటువంటి ప్రజా సంప్రదింపులు అవసరం లేని జాబ్. ఇప్పటివరకు ఆమె 'బోట్ జెట్టి' బ్రాంచ్‌ లో కస్టమర్‌ రిలేషన్‌ సెక్షన్‌ లో టెలికాం టెక్నీషియన్‌ గా పనిచేస్తున్నారు. విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహించక పోయినప్పటికీ ఆమెను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. శబరిమల ఆలయంలో వెళ్లడానికి ప్రయత్నించి ఆమె అనేక మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని, అందుకు ముస్లిం కమ్యూనిటీ నుంచి ఆమెను తొలగించినట్లు కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ వెల్లడించింది. 

అయితే రెహానాను ఉద్యోగం నుండి తొలగించాలంటూ శబరిమల కర్మ సమితి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించింది. అలాగే ముస్లిం కమ్యూనిటీ నుంచి ఆమెను తొలగించినట్లు 'కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్'  వెల్లడించింది. ఆమె అనేక మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఆ కౌన్సిల్ అభిప్రాయ పడింది. 
Image result for sabarimala women entry case
హిందూ మహిళల ప్రవేశం విషయంలో సుప్రీంకోర్ట్ తీర్పుతో వివాదాస్పదమైన శబరిమల ఆలయంలోకి హిందూమహిళల ప్రవేశమే సమస్యగా మారినప్పుడు తను ముస్లిం అయి ఉండీ విచ్చలవిడిగా హిందూ దేవాలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించినందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెహానా ఇంటి మీద దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. 
Image result for rehana fathima
భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ ఆలయంలోకి ప్రవేశించాలన్న ఆమె ప్రయత్నాన్ని ఆందోళన కారులు అడ్డుకున్నారు. అంతేకాకుండా ఇతరుల మత సంప్రదాయాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించిందని ఆమె మీద కేసు కూడా నమోదైంది. రెహానా కొంతకాలం మోడల్‌ గానూ పనిచేశారు. మోరల్ పోలీసింగ్‌ ను వ్యతిరేకిస్తూ 2014 లో వచ్చిన ‘కిస్‌ ఆఫ్ లవ్’ అనే ఉద్యమంలో ఆమె కూడా పాల్గొన్నారు. సెప్టెంబరు 28 న ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం అన్ని వయసుల మహిళలకు శమరిమలలోకి ప్రవేశం కల్పిస్తూ చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Image result for rehana fathima
తనది కానిది తనకు అర్హత లేని చోట నిబంధనలకు విరుద్ధంగా అదీ సమస్యాత్మక సమయంలో శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి ఒక మహిళ ప్రవేసించటానికి ప్రయత్నించటం దాదాపుగా శాంతి బద్రతల సమస్యే. 

మరింత సమాచారం తెలుసుకోండి: