దీపావళి పండుగ అంటే చిన్నా పెద్ద అందరికీ ఇష్టమే. ఎందుకంటే పెద్దలంత పిల్లలుగా మారే రోజు అదే కదా. ఇక రాజు పేదా కూడా ఆ రోజు కలసిపోతారు. ఆనందంతో చిందులు వేస్తారు. అంతా ఒక్కటిగా సంబరాలు చేసుకుంటారు. దీపాల కాంతుల్లా మనసులు కూడా వెలిగిపోతాయి. అక్కడ ఉన్న శోకాలు అన్ని పారిపోతాయి. 


నిజానికి దీపావళి పండుగ వెనక ఎంతో సందేశం ఉంది. పైకి అల్లరిగా జరుపుకునే పండుగ అనుకుంటాం. కానీ అది కానే కాదు. చీకటి అంటే బయట కనిపించేది కానే కాదు. మనిషిలోపల ఎన్నో చీకట్లు ఉన్నాయి. బాధలు దుఖాలు కలతలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా చీకట్లే. వీటిని పారదోలేదే దీపావళి. అంతా ఒక్కటి అని చాటిచెప్పేదే దీపావళి. నీ సుఖం మాత్రమే  కాదు పక్క వాడి బాధను కూడా పంచుకో అని సందేశం ఇచ్చేదే దీపావళి పండుగ.


విక్రుత రూపలు ఎన్నో మనిషిలో ఉన్నాయి. అన్యాయం చేయాలనుకొవడం, స్వార్ధం, వంచన, ద్వేష భావం, భెదభావం ఇలా ఎన్నో రాక్ష‌స గుణాలు తనలో నింపుకున్న మానవుడు వాటిని కాల్చి పారేసి తనలో కొత్త వెలుగు నింపుకోవడమే దీపావళి పండుగ ఇచ్చే సిసలైన సందేశం. దానిని అంతా పాటించాలి. సరదాగా జరుపుకోవడం కాదు. మనలో ఉన్న చీకటిని, బయట సమాజంలో ఉండే చీకటిని కూడా లేకుండా చేయడమే దీపావళి పండుగ పరమోద్దేశం. అందుకోసం అంతా పాటు పడాలి. అపుడే దీపావలి వెలుగులు మరింత కాంతివంతంగా కనిపిస్తాయి. మురిపిస్తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: