దీపావళి మానవాళికి ఎన్నో నీతులు చెబుతుంది. అర్ధం చేసుకునే మనసు ఉంటే దీప కాంతులు ఎన్నో వూసులు చెబుతాయి. దీపావళి అంటే దీపాల వరస అని అర్ధం. ఒక దీపం వేరొక దీపాన్ని వెలిగిస్తుంది. అలా మనిషి తనకున్న మెధస్సును తెలివిని సమాజానికి ఉపయోగించి పదిమందికీ మేలు చేయాలన్న నీతిని ప్రభోదిస్తుంది దీపాల వరస. మరి వాటిని చూసి ఆనందించడం ద్వారా మనసు ఎంత నిర్మలం అవుతుందన్నది ప్రతి వారికి వ్యక్తిగత అనుభూతిగానే ఉంటుంది. 


ఇక దీపావళికి కాల్చే ఒక్కో మందుగుండు సామానూ ఎన్నో కధలు చెబుతుంది. ఉదాహరణకు తారా జువ్వ గురించి తీసుకుంటే అది ఎంతో ఎత్తుకు ఎగురుతుంది. మనిషి ఆలోచనలు కూడా  తనలాగ ఉన్నతంగా ఉండాలని ఆ జువ్వ చెబుతుంది. చిచ్చుబుడ్డి గురించి తీసుకుంటే బతుకులో వెలుగులు ఎపుడూ శాశ్వతం కావని, బాధలు కూడా వెంటనే ఉంటాయని వేదాంతం వల్లిస్తుంది. మతాబులు తీసుకుంటే మమతలు ఉన్న్న ప్రతి లోగిలీ తన లాగే కళకళలాడుతుందని, అంతా మమతానురాగాలతో కలకాలం ఉండాలని ఆకాంక్షిస్తుంది.


.
ఇక సిసింద్రీలు, పిచుకలూ అల్లరి వేషాలు వేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెబుతాయి. బాంబులు,  టపాసులు రచ్చ చేసుకుని గొడవలు పడితే ఆ శబ్ధ కాలుష్యం ఎలా ఉంటుందో వివరిస్తాయి. అలాగే తీగలు సన్నని  కాంతులతో మెరుస్తూ అందమైన మెరుపు తీగల్లాంటి అమ్మాయిలను గుర్తుకుతెస్తాయి. మొత్తానికి దీపావళి మంచి చెడు అన్నీ సవివరంగా వివరిస్తుంది. విన్న వారిని తరింపచేస్తుంది. ఏదీ లేదనుకునే వారిని, కాదనుకునే వారిని గాయాలపాలు చేసి గుణపాఠం చెబుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: