75 యేళ్ళ పినరయ్ విజయన్ వామపక్ష భావాలు దేశవ్యాప్తంగా అంతరించి పోయినట్లే. ఈ ముతక మనిషి ముతక భావాలు వదిలేసి ఈ మద్యనే సునామీతో తల్లడిల్లిన కేరళ రాష్ట్ర అభివృద్ది చూసుకోకుండా ఈ వయసులో ఈ ముతక ఆలోచన లెందుకు. ఇలాంటి వాళ్లవల్లే రానున్న కొద్దికాలం లోనే కమ్యూనిజం మూలాలతో సహా దేశం నుండే పెకలించబడే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. రాష్ట్రం అత్యంత ధారుణ పరిస్థితులతో భ్రష్టు పట్తి వున్నప్పుడు ఇలాంటి చెత్త విషయాల్లో తలదూర్చట మెందుకు? అయినా రెహానా ఫాతిమా లాంటి అరాచకవాదుల ప్రోత్సాహం వెనుక ప్రభుత్వం నిలిచిందన్న వాదన అబద్ధం కాదనే అంటున్నారు.  ఇప్పుడు కేరళలో పరిపాలన మూర్ఖుడు లేదా పిచ్చోడి చేతిలో రాయిలా మారి ఇలా ఎవరిపైనైనా విసరొచ్చు.
Image result for pinarayi vijayan
రాజుగారు తల్చుకుంటే దెబ్బలకు కొదవా? అలాగే ప్రభుత్వం తలచుకుంటే సౌమ్యులైన ప్రజాస్వామ్యవాదుల చర్మం వలిచెయ్యటం పెద్దపని కాదు. ప్రభుత్వం పూను కుంటే కోట్ల మంది మనోభావాల్ని నారింజ  తొక్క తీసినట్లుగా తీసి అవతలకు పారేయటం మన ప్రజాస్వామ్యంలో మామూలే. తాజాగా కేరళ ఎపిసోడ్ ను చూస్తే, ఇదే విషయం ఇట్టే అర్థమవుతుంది. 
Image result for pinarayi vijayan stand behind rehana fathima
*శబరిమలలోని అయ్యప్పను దర్శించుకోవటం అన్నది భక్తి భావంతో చూడాలా?
*వ్యక్తిగత ప్రతిష్ట కోసమన్నట్లు చూడాలా?
*అసలు దేవుడన్నది ఒక నమ్మకం, విశ్వాసం.
*ఆ నమ్మకం అన్నది లేనోళ్లు దేవుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఏంది?
Image result for pinarayi vijayan stand behind rehana fathima
పురుషాధిక్యత, మహిళాధిక్యత లాంటి మాటల్ని పక్కన పెట్టి, కోట్లాది మంది మనోభావాల్ని వారి ఆశల్ని అపహాస్యం  చేస్తే వచ్చే లాభమేంది?  అన్నది చూస్తే, అనవసర మైన ఉద్రిక్తలు తప్పించి ఇంకేమీ ఉండదు. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా వంద మంది పోలీసుల్ని వెంటపెట్టుకొని కొందరు మహిళలు అయ్యప్ప సన్నిధానం వరకూ వెళ్లి రావటం దేనికి నిదర్శనం? వారి చర్యలతో కోట్లాది మందికి ఎలాంటి సందేశాల్ని ఇచ్చినట్లు?
Image result for pinarayi vijayan stand behind rehana fathima
మీరేమైనా అనుకోండి. మేం చేయాల్సింది చేస్తాం. మిమ్మల్ని మేం గౌరవించటం, మా పంతం మేం ప్రదర్శిస్తాం. మీరంతా వ్యతిరేకిస్తే, మేం వెనక్కి తగ్గితే, మా మొండి తనం మాటేంటి? సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారటం తప్పించి ఈ మొత్తంలో ఏం సాధించారంటే, కోట్లాది మంది భావోద్వేగాల్ని టచ్ చేయటం వారికి ఆవేదన ను మిగల్చటం తప్పించి మరింకేమీ ఉండదన్నది మర్చిపోకూడదు.


దేశంలో చాలానే అయ్యప్ప దేవాలయాలు ఉన్నాయి. వేటికి లేని ఒక ప్రత్యేకత శబరిమలకు ఉందన్నది ఒక నమ్మకం. అక్కడి స్థల చరిత్ర, ఆలయ కట్టుబాట్లను చూస్తే, అక్కడికి కొన్ని వయసుల మహిళలు మాత్రమే రావాల్సి ఉంటుంది. అంటే, ఇక్కడ పురుషాధిక్యత అంటూ ఏమీ లేనట్లే. పురుషాధిక్యత అన్నది ఉంటే, అసలు మహిళ ల్నే రానివ్వరు కదా?  
Image result for pinarayi vijayan stand behind rehana fathima
ఇక కేరళ ముఖ్యమంత్రి విజయన్ మాటల్లో చూస్తే, కొన్ని వర్గాల ప్రజల్ని తొక్కేసేందుకే ఇలాంటి పరిమితులు అంటూ చెప్పిన మాటల్ని చూస్తే, అందులో డొల్లతనం తప్పించి మరింకేమీ ఉండదు. ఎందుకంటే, శబరిమల అయ్యప్పను దర్శించుకునే భక్తులకు కులాల పరిమితులు ఏమీ లేవు. కోట్లాది మంది వద్దంటే వద్దంటున్న విషయాన్ని తన వ్యక్తిగత ప్రతిష్ఠగా కేరళ ముఖ్యమంత్రి విజయన్ తీసుకున్నారా? అంటే అవునన్న మాటను కొందరు చెబుతుంటారు. సహజసిద్ధ కమ్యూనిస్ట్ అయిన ఆయన, పంతంతో, కావాలనే ఇదంతా చేశారా? అన్న చర్చ ఇప్పుడు సాగుతోంది.


ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆసక్తికరమైన విషయం ఏమంటే, ప్రజలు నమ్మి చేతికి అధికారం ఇస్తే, దాన్ని అడ్డుగా పెట్టుకొని ముఖ్యమంత్రి తన వ్యక్తి గత ఇష్టాయిష్టాల్ని అదే ప్రజల మీద బలవంతంగా రుద్దారన్నది ఇప్పుడు వినిపిస్తున్న ఒక మాట. అదే లేకుంటే, శబరిమల ఆలయంలోకి ఏదోలా కొంతమంది మహిళలకు వంద మందికి పైగా సాయుధు లైన పోలీసుల్ని పహరా పెట్టి, వారికి పోలీసుల డ్రెస్సులు వేసి మరీ, శబరిమల అయ్యప్ప దర్శనం చేయించటం ద్వారా, కోట్లాది మంది నమ్మకాల్ని తొక్కలా తీసిపారేయాలన్న పట్టుదల రాజ్యధర్మమా?
Image result for pinarayi vijayan stand behind rehana fathima

హిందూధర్మం మతవిశ్వాసాలపై పినరయ్ విజయన్ కౄరదృష్టి 


ఐదేళ్లు మాత్రమే పాలించే అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు, శతాబ్దాల తరబడి నమ్మే ఆచారాల్ని పంప్రదాయాల్ని ఏదో రకంగా కాలరాయాలన్న అత్యుత్సాహం దేనికి నిదర్శనం? బావి తరాలకు విజయన్ లాంటి పాలకులు ఇస్తున్నసంకేతాలు ఎలాంటివి? సమాజంలో అలజడులను ప్రేరేపించేలా ప్రజా ప్రభుత్వంచేసే ప్రయత్నాల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అన్నది ఇప్పుడు అసలు సిసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.


ఎక్కువలో ఎక్కువ 8 నుండి 10 మంది హిందూ మతంపై అవగాహన లేని రెహానా ఫాతిమా లాంటి అరాచక మహిళలు సనాతన దర్మంగా విలసిల్లే 10 నుండి 50 యేళ్ళ మహిళల ప్రవేశం మాత్రమే నిషేధించబడ్ద వ్యవహారంలో స్పందించినంత మాత్రాన జాతి ధర్మాన్ని శాసించగలడా? ఈ విజయన్. ఈ సారి రానున్న ఎన్నికల్లో ఈ వృద్ధ కపోతానికి చరమ గీతం పాడబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు హిందూ మతవాదులు మొత్తం, పరమత సహనం కలిగిన భారతీయులు అంతా, వామపక్షవాదులతో కలిపి ఏకమై ఈ ముతక భావాల రాజ్యాధికారానికి తిలోదకాలివ్వనున్నారు. 

Image result for pinarayi vijayan stand behind rehana fathima

మరింత సమాచారం తెలుసుకోండి: