వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగింది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు రావటానికి విమానాశ్రయంలో వెయిట్ చేస్తుండగా హఠాత్తుగా జగన్ పై దాడి జరిగింది. లాంజులో కూర్చుని జగన్ మాట్లాడుతున్న సమయంలో ఓ వెయిటర్ శ్రీనివాస్  కత్తితో జగన్ పై దాడి చేశాడు.

అయితే, ఆ దాడి నుండి జగన్ తృటిలో తప్పించుకున్నారు. జగన్ పై ఎందుకు దాడి జరిగింది అన్న విషయాలేవి తెలియలేదు. వెయిటర్ తనంతట తానే దాడి చేశాడా ? లేకపోతే ఇంకెవరైనా దాడి చేయించారా అన్నది తేలాల్సుంది. వెయిటర్ దాడితో జగన్ ఎడమ భుజంపై రక్త గాయమైంది.

 

జగన్ నిజానికి జడ్  క్యాటగిరీలో ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే జగన్ పై ఓవెయిటర్ అది అంతమంది చుట్టూ ఉన్న సమయంలో ధైర్యంగా దాడికి దిగటమే ఆశ్చర్యంగా ఉంది. సరే వెయిటర్ ను పట్టుకుని పోలీసులకు అప్పగించారనుకోండి అది వేరే సంగతి. జగన్ గనుక ప్రమాదాన్ని గ్రహించి పక్కకు తప్పుకోకపోతే పెద్ద ప్రమాదం జరిగేదనటంలో  సందేహలేదు.


ఎయిర్ పోర్టు క్యాంటిన్ లో పనిచేసే వెయిటరే దాడికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, దాడికి కారణాలేంటన్నది మాత్రం ఇంకా తేలలేదు. మొత్తానికి జగన్ పై దాడి జరగటమంటే సెక్యూరిటీ వైఫల్యం గానే చూడాలి. సెల్ఫీ తీసుకుంటానని దగ్గరకు వచ్చి తర్వాత కత్తితో దాడి చేశాడని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: