Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 11:55 pm IST

Menu &Sections

Search

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై హత్యా ప్రయత్నం - ప్రచారం కోసమే : పోలీసులు

విశాఖ విమానాశ్రయంలో  వైఎస్ జగన్ పై హత్యా ప్రయత్నం - ప్రచారం కోసమే : పోలీసులు
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై హత్యా ప్రయత్నం - ప్రచారం కోసమే : పోలీసులు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్‌లో ఆయనపై ఒక దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చి వైఎస్‌ జగన్మొహనరెడ్డిపై దుండగుడు దాడి చేశాడు. కోడిపందేలకు ఉపయోగించే కత్తితో అతను దాడికి తెగబడ్డాడు. దీంతో జగన్ భుజానికి తీవ్రగాయమైంది. దాడిచేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఒక క్యాంటీన్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. దాడిజరిగిన వెంటనే  దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
ap-news-visakha-airport-ys-jagan-mohan-reddy
294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌ గురువారం హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన వీఐపీ లాంజ్‌ లో ఉండగా శ్రీనివాస్‌ అనే వెయిటర్‌, సెల్ఫీ తీసుకుంటానంటూ వైఎస్‌ జగన్మొహనరెడ్డి వద్దకు వచ్చారు. అతను వస్తూనే కోళ్ల పందెలకు ఉపయోగించే కత్తి తో జగన్ దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో జగన్‌ భుజానికి తీవ్ర గాయమైంది. కత్తికి విషపూరిత పదార్థం పూసి ఉండవచ్చు నని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్ర గాయం కావడంతో ప్రాథమిక చికిత్స అనంతరం వైఎస్‌ జగన్మొహనరెడ్డి హైదరాబాద్‌ బయలుదేరారు.
ap-news-visakha-airport-ys-jagan-mohan-reddy
దాడిచేసిన శ్రీనివాస్ ను విమానాశ్రయం భద్రతాసిబ్బంది పట్టుకుని సిఎస్ఎఫ్ఐకి అప్పగించారు. హైదరాబాదు రావడానికి జగన్ విశాఖ విమానాశ్రయానికి వచ్చారు . ఈ సమయంలో ఆయనపై దాడి జరిగింది. జగన్ ఎడమ భుజంపై స్వల్పంగా గాయమైంది. శ్రీనివాస్ ఎందుకు దాడికి ప్రయత్నించాడనేది తెలియదు. విమాశ్రయంలో జగన్ కు ప్రాథమిక చికిత్స చేశారు. సెల్ఫీ తీసుకుంటానని దగ్గరకు వచ్చి శ్రీనివాస్ జగన్ పై దాడి చేశాడు. విమానాశ్రయంలోని క్యాంటిన్లో అతను పనిచేస్తున్నట్లు తేలింది. అతని చేత ఎవరైనా ఆ దాడి చేయించారా? అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.
ap-news-visakha-airport-ys-jagan-mohan-reddy
పాపులారిటీ కోసమే జగన్‌పై శ్రీనివాస్ దాడికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా దర్యాప్తులో తేలినట్టుగా విశాఖ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరుపు తున్నట్టు ఆయన తెలిపారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ పై దాడి ఘటనపై విశాఖ వెస్ట్ సీపీ అర్జున్,  అసిస్టెంట్ సీపీలు గురువారం నాడు విశాఖలో మీడియాతో మాట్లాడారు.  వైసీపీ చీఫ్ జగన్‌‌పై దాడి ఘటనపై డీజీపీ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. శ్రీనివాసరావు దాడికి పాల్పడిన వెంటనే సీఐఎస్ఎఫ్ పోలీసులు  అదుపులోకి తీసుకొన్నారని చెప్పారు. అయితే  శ్రీనివాస్ జగన్ అభిమాని అని  తమకు అందిన సమాచారం మేరకు తేలిందని అన్నారు. 
ap-news-visakha-airport-ys-jagan-mohan-reddy
సిట్  దర్యాప్తు చేస్తున్నట్టు విశాఖ వెస్ట్ ఏసీపీ అర్జున్  చెప్పారు. విమానాశ్రయంలో  సాక్ష్యాలను  సీఐఎస్ఎఫ్‌ నుండి సేకరించనున్నట్టు చెప్పారు.ఈ ఘటన మధ్యాహ్నం 12.34 నిమిషాలకు చోటు చేసుకొందన్నారు.  శ్రీనివాస్ పై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. సిట్ ఈ ఘటనను విచారించనున్నట్టు చెప్పారు.  శ్రీనివాస్ వద్ద దొరికిన  లేఖలను మీడియా కు  విడుదల చేస్తామన్నారు.

ap-news-visakha-airport-ys-jagan-mohan-reddy

అత్యంత పటిష్టమైన భద్రతా వలయం మధ్య, రాష్ట్ర పోలీసులను కూడా అనుమతించకుండా, సీఐఎస్ఎఫ్ భద్రత మధ్య ఉండే ఎయిర్ పోర్ట్ లో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగితే, ఆ హత్యకు ప్రయత్నించిన నిందితుడు, జగన్ అభిమాని అంటూ ఏపీ పోలీసు బాస్, డీజీపీ ఆర్ పి ఠాకూర్ మీడియాకు వెల్లడించటం కొసమెరుపు. అప్పటికప్పుడే ఆయన ఈ కేసు తెలుగుదేశం పార్టీ మీదకు రాకుండా, పక్కకు మళ్లించేందుకు తపన పడుతున్నట్లుగా ఆయన చెప్పటం దెశంలో రాజ్యాంగ మూడవ స్థంబమైన ఎక్జెక్యూటివ్ వ్యవస్థ ఎంతగా శాసన వ్యవస్థకు లేదా ప్రభుత్వంలోని రాజకీయనాయకులకు బానిసత్వం చేస్తుందో అర్ధమౌతుందని జనం బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇక్కడ డిజిపి తన నీడలో శాంతిభద్రతలకు భరోసా యివ్వకుండా పక్కా రాజకీయ నాయకుని స్టయిల్లో మాట్లాడటం చూస్తే రాజ్యాంగ మూలస్థంభం ప్రజలకు బాసటగా నిలవలేక మూలుగుతున్నట్లే ఉంది.  

ap-news-visakha-airport-ys-jagan-mohan-reddy

ap-news-visakha-airport-ys-jagan-mohan-reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి – బోల్తా కొట్టిన బుల్-బుల్ పిట్ట కేసీఆర్....?
పివి నరసింహారావు - మన్మోహన్ సింగ్ సరళీకృత ఆర్ధిక విధానాలు భారత్ ను బంగారుబాటలో నడిపించాయా?
భారత్‌ ప్రయాణం ఇక నల్లేరు మీద నడకకాదు! ‘అంతర్జాతీయ మందగమనం’ వైపే!
టిఎస్ ఆర్టీసి ఉద్యోగులను ‘సెల్ఫ్ డిస్మిస్’ అయ్యారన్న కేసీఆరే ‘సెల్ఫ్ డిస్మిస్ అయిపోతారా?’
మోడీ పై దాడి - ఈ రేంజ్ లో మోడీ శతృవులు కూడా కేంద్రంపై దాడి చేయలేదేమో!
పాన్ ఇండియా హీరోగా స్థిరపడ్డ ప్రభాస్ - ప్రాంతీయ హీరోగా మిగిలిపోయిన చిరంజీవి
బాబోర్లకు దిమ్మదిరిగి బొమ్మ కనిపిస్తుందట – మరేంచేస్తాం! మనకప్పుడు అధికారమధంలో కళ్ళు కనపళ్ళేదు!
కేసీఅర్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందా! ఇదే దానికి చిహ్నం!
అబద్ధాలాడే కేసీఆర్ ది పక్కా దోర మనస్తత్వం : విజయశాంతి & ప్రొ. కోదండరాం
తలసాని, పువ్వాడ లాంటి అవకాశవాదులకు నిలయం కేసీఆర్ కాబినెట్: ఆర్టీసీ ఉద్యోగులు
కేసీఆర్ చెవిలో ఇక ప్రతిక్షణం రాజకీయ బాజా మోతలే!
ఇదే ఆర్ధిక మాంద్యం దెబ్బ - నడి సముద్రంలో పరిశ్రమ ! కల్లోల కడలిలో ఆటోమొబైల్ ఉద్యోగులు
కేసీఆర్ పాలనకు కష్టకాలం దాపురించినట్లేనా! నగరవాసులు సున్నం పెట్టటానికి రడీగా ఉన్నారా!
ఆర్థిక మాంద్యమా! నీవెక్కడ? 3 సినిమాల లాభాలే సాక్ష్యం!
“శ్రీరాముడిని వదిలేసినా! శ్రీరాముడు వదిలేసినా!” మునిగిపోక తప్పదు
ఆర్టీసీ తరవాత కేసీఆర్ లక్ష్యం రెవెన్యూయేనా? అయితే జనం ఓట్లు కేసీఆర్ కే!
వివాహేతర సంభందం నేఱం కాదన్న, సుప్రీం తీర్పు శిరోధార్యమా?
ముద్దు ముద్దుకు తేడా ఉంది - మురిపించే అదృష్టం నాకే ఉంది
కేసీఆర్ పాలనలో ఓటర్లు కూడా 'సెల్ఫ్-డిస్మిస్' అవుతారేమో? : విజయశాంతి
About the author