చంద్రబాబు తనపై ప్రధాని నరేంద్ర మోడీ కక్ష గట్తాడని అంటుంటారు. ఆఅయనపై, ఆయన టిడిపి పై మోడీ కక్షగట్టటం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల సమస్య కాదు. అలాగే చంద్రబాబునాయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై కక్ష గట్టటం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాంతిభద్రతల సమస్యే. అయితే ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఈ సమస్యపై స్పందిస్తున్నారు. అలాగే తెలుగువారి అభిమాననటుడు అందరి భావాలు ప్రతిబించే లాగా కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ప్రశ్నలు సంధించారు. వాటికి సమాధానా లు ప్రభుత్వం ఇస్తే సరిపోతుంది. 
Image result for Jagan Murder attempt letter
ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై జరిగిన కత్తి దాడిపై అనేక సందేహాలు వ్యక్తం చేశారు సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు. ఈ దాడిని ఖండిస్తూ మీడియాతో మాట్లాడారు మోహన్ బాబు. ఆయన మాట్లాడుతూ, ‘ప్రజాక్షేమాన్ని కోరుతూ 12 జిల్లాలు పాదయాత్ర చేశాడు. ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. ఇప్పటి వరకూ ఎలాంటి అపశృతి జరగలేదు. మీరే ఆలోచించుకోండి ప్రతి ఒక్కరికి ఆత్మ, అంతరాత్మ, పరమాత్మ ఉంటుంది. ఇది వేదం కాదు, వేదాంతం అంతకంటే కాదు. ఎవరికైనా ఆవేశం ఉంటుంది. ఒక్కొక్కరికి హద్దు మీరి ఉంటుంది. ఒక మనిషి గా మానవత్వం ఉన్న మనిషిగా, పద్దతిగా ఉన్న మనిషిగా నేను ఎప్పుడో రాజ్యసభ సభ్యుడిగా చేసినా దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఒక దద్దు గా ఇంట్లో కూర్చోలేను. 
Image result for mohan babu comments on attempt on jagan
జరిగిన ఘటనపై మీరే ఆలోచించండి. 

*ఆ కోడి కత్తి ఎయిర్ పోర్ట్‌లోకి ఎలా వచ్చింది. 
*జగన్‌కి అతని తల్లి తండ్రి ఆశీస్సులు అన్నింటికంటే మించి తెలుగు ప్రజల ఆశీస్సులు ఉండబట్టి గండం నుండి గట్టెక్కాడు. 
*ఇంత దారుణమా? 
*అతను ఏం చెడు చేశాడయ్యా బాబూ! నాకు తెలిసి జగన్‌ ఏం తప్పుచేయలేదు. నేనొస్తే ఇలా చేస్తాను అని చెబుతున్నాడు. 
*అన్ని వేలమైళ్లు పాదయాత్ర చూస్తున్న జగన్ మోకాళ్లు ఏమౌతాయో తెలియదు కాని, నరమానవుడు ఇప్పటివరకూ ఎవరూ చేయలేదు. 
Image result for mohan babu comments on attempt on jagan
*అతడు ప్రజ ల్లోకి పాద యాత్ర చేస్తుంటే కోడి కత్తి ఎలా వచ్చిందండీ ఎయిర్ పోర్ట్‌లోకి? ఎవరిది తప్పా? ఎవరిది రైటా? అని ప్రజలకు తెలుసు. 
*నా జేబులో చిన్న పెన్ ఉంటే ఎయిర్ పోర్ట్‌లో అడ్డుకున్నారు. అలాంటిది కత్తి కంటే పదునైన కోడికత్తిని లోపలికి ఎలా వచ్చింది? 
*ఆ కత్తికి విషం కూడా పూస్తారు. జగన్‌ని పొడిచిన కత్తి అలాంటిది కాకూడదని కోరుతున్నా. 
ఈరోజు ఆ పొడిచిన వాడికి ఎవడెవడో సర్టిఫికేట్‌లు ఇచ్చేస్తున్నారు చాలా మంచి వాడు అదీ ఇదీ అని. మీరు ఎలా నిర్ధారణ చేస్తారు. 
*కత్తి ఎలా లోపలికి వెళ్లింది? 
*ఎవరు ప్రోత్సహించారు? 
Image result for mohan babu comments on attempt on jagan
*వాడిని ఎన్ని రోజుల నుండి ప్లాన్ చేసి పెట్టారు? 
*వాడ్ని ఎన్నిరోజులుగా నటించాడు? మీ అభిమానినే అని దగ్గరకు చేరి గొంతుమీదే కత్తి పెట్టాడంటే, ఇది ఎంత హేయమైన చర్య. 
*దీన్ని మసిపూసి మారేడుకాయలా చేయకుండా, ఆల్రెడీ జగన్‌తో కలిసి వాడు దిగిన ఫోటోలను నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. 
*ఇప్పుడు గ్రాఫిక్స్ చేసి అలాంటి ఫోటోలను చేయలేమా? 
*అలాంటివి సెకన్ల పని? అది పెద్ద విషయం కాదు. 
*అసలు కత్తి ఎలా తీసుకువెళ్లాడు? 
*ఎందుకు తీసుకువెళ్లాడు? అన్నది అన్వేషణ చేయాలి. 
*జగన్ అభిమాని అని చెప్పి దగ్గరకు వచ్చాడు. జగన్ ప్రేమతో అతడ్ని దగ్గరకు తీసుకున్నాడు. అది కూడా తప్పు అంటే ఏం చేయాలి. నా దగ్గరకు చాలా మంది అభిమానులు వస్తారు? వాడు నిజమైనవాడో కాదో ఎలా తేల్చాలి? ఉన్నది ఉన్నట్లు చెప్పాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. 
*మరణం అనేది ఎవరికైనా తప్పదు. నిజాన్ని చెప్పండి, నేను తప్పు చేసినా చెప్పాలి. జరిగిన సంఘటన కలలో కూడా మళ్లీ జరగకూడదు. ఏ వ్యక్తికీ జరగకూడదు. 
Related image
ప్రజలకోసం పోరాడే జగన్ విషయంలో ఇలా జరగడం దారుణం. నిజా నిజాలు తెలియకుండా నిందించడం కరెక్ట్ కాదు. చాలా మంది ఖండిస్తున్నాం అంటున్నారు. ఖండించకపోతే ఎంకరేజ్ చేస్తారా? శత్రువుని కూడా పొడవ కూడదు. 


శత్రువు ఓటమి కోరుకో, తప్పులేదు. నేను విద్యాలయాలు పెట్టా, పక్కోడు పోవాలని పెట్టానా? ఇలాంటి దారుణాలు మళ్లీ జరక్కూడదు. జరిగిన విషయంపై చాలా మంది ఫోన్‌లు చేశారు. అందులో చాలా మంది తెలుగుదేశం వాళ్లు ఉన్నారు. అన్నా! జగన్‌పై దాడి చేయడం దారుణం అన్నా! అన్నారు. అన్ని పార్టీలు వారు తప్పే అంటు న్నారు. మరికొంత మంది బస్‌లు తగలబెడదాం, అద్దాలు పగలగొడదాం అన్నారు.. వద్దురా! అని ఆపేశా అల్లర్లు సృష్టించడం కరెక్ట్ కాదని చెప్పా. ఏది ఏమైనా ఇలాంటి దాడులు జరగటం దారుణం అన్నారు మోహన్ బాబు. 

Image result for Jagan Murder attempt letter

నోరున్న ప్రతి ఒక్కడు ఖండిస్తూనే ఉంటాడు. అలాగే చంద్రబాబు ఖండించారు. డిజిపి ఆఫ్ ఆంధ్రప్రదెశ్ ఖండన ఒక అద్భుతం. ఆయన ఒక రాజకీయ నాయకుడే అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: