ఆంధ్ర ప్రదేశ్ ప్రతి పక్ష నేత అయిన జగన్ మీద దాడి ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేపింది.ఏ కేసు విషయంలో అయినా పోలీసుల విచారణకు ముందు ఒక రకమైన వార్తలు రావడం, ఆ తర్వాత విచారణ జరిగి అసలు విషయాలు నిగ్గుతేలడం జరుగుతూ ఉంటుంది. ఏ కేసు విషయంలో అయినా సంఘటన జరిగినప్పుడు ఒక రకంగా కేసులు నమోదు చేసినా.. నిందితులు దొరికాక విచారణ అనంతరం వేరే విషయాలు నిగ్గు తేలుతూ ఉంటాయి.


అదేంటో.. చంద్రబాబు హయాంలో రాజకీయ ప్రమేయం ఉన్న కేసుల్లో మాత్రం.. ముందు ఏం ప్రకటిస్తారో, ఆ తర్వాత నిందితుల వెర్షన్ కూడా అదే అవుతూ ఉంటుంది. అందుకు తాజా ఉదాహరణ జగన్ పై జరిగిన హత్యాయత్నం. ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఏడుగంటల పాటు విచారణ చేసి... చివరకు చెబుతున్న విషయం ఏమిటంటే.. అంతకు ముందు చెప్పినదే!


ఈ మాత్రం ఏడుగంటల సేపు విచారణ ఎందుకు? సంఘటన జరగగానే ఏం చెప్పారు? నిందితుడు జగన్ ఫ్యాన్ అని... అతడి కులం ఏమిటో కూడా డీజీపీ స్వయంగా చెప్పాడు. అతడు సానుభూతి కోసమే జగన్ మీద అటాక్ చేశాడని... తేల్చేశారు. సంఘటన జరగగానే ఈ విషయాన్ని చెప్పారు. విచారణ అనంతరం నిందితుడి నోటి నుంచి ఇవేమాటలు అని చెబుతున్నారు. మరీ ఇంత కంటే సాక్ష్యాలు ఏం కావాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: