వైఎస్ జగన్ ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తి. సర్వేలు బట్టి చూసుకుంటే ఆయన రేపటి ఏపీ సీఎం అని కూడా చెబుతున్నాయి. జగన్ రాజకీయ జీవితం చూసుకున్నా ఆయన పాపులర్ జన నాయకుడు. పదేళ్ళ రాజకీయ జీవితంలో తండ్రి కంటే ఎక్కువ అభిమానం జనంలో సంపాదించుకున్న వాడు. ఆయన అడుగు పెడితే చాలు వేలాది మంది జనం పోగు అవుతారు. ఆయన ప్రసంగాలు వినేందుకూ ఉవ్విళ్ళూరుతారు 


జగన్ కి ముప్పు :


వైఎస్ జగన్ రాజకీయంగా ఎదుగుతూ వస్తున్నాడు. అది చాలా వేగంగా ఉంది. ఆయన 2014లోనే సీఎం కావాల్సింది. కానీ త్రుటిలో తప్పిపోయింది. అయినా ఇపుడున్న ఆయన ప్రతిపక్ష నాయకుని హోదా కూడా ఆయన ఎక్కిన మరో శిఖరమే. జగన్ నిత్యం జనంలో ఉంటున్నాడు. పదేళ్ళుగా అయన ఇంటి పట్టాన ఉన్నది తక్కువ. అటువంటి నాయకుని మీదనే అటాక్ జరిగింది. అంటే అతని ప్రాణాలకు ముప్పు ఉందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


గండం గట్టెక్కిందా :


జగన్ విషయంలో గండం గడిచినట్లేనా అంటే లేదు అనే సమాధానాలు వస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా అరు నెలల సమయం ఉంది. జగన్ రోజు ప్రజల్లోనే ఉంటున్నారు. ఆయన ఇంకా పాదయాత్ర పూర్తి చేయాల్సి ఉంది. భద్రతా వలయాన్ని పక్కన పెట్టి మరీ జగన్ జనంలోకి వస్తున్నారు. ఈ సమయంలో ఏమైనా దాడులు అతి సులువుగా జరగవచ్చు. ఇప్పటివరకూ అయితే జగన్ విషయంలో ఏమీ లేకపోయినా విమానాశ్రయంలో కత్తితో దాడి ఘటన తరువాత జగన్ భద్రత ఏమీ బాగులేదన్నది అర్ధమవుతోంది.


జాగ్రత్త పడాల్సిందే:


జగన్ తన ప్రాణాలకు లెక్క చేయకుండా పాదయాత్ర చేస్తున్నారు. ఏకంగా వేల కిలోమీటర్ల పాదయాత్ర ఆయన చెస్తూ వస్తున్నారు. లక్షలాది మందిని ఆయన కలుస్తున్నారు. మరి ఈ టైంలో ఏదైనా అనుకోనిది జరిగితే ఏమైనా ఉంటుందా. నిజానికి ఎయిర్ పోర్ట్ ఘటన తలచుకుంటేనే హడలెత్తిపోతోంది. జగన్ చాల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు, కానీ జాగ్రత్త పడకపోతే మరిన్ని ఇబ్బందులు వస్తాయని ఆ ఘటన తెలియచేస్తోంది. జగన్ ఇకపైన అంత సులువుగా జనాల్లోకి వెళ్ళడం మంచిది కాదు. ఆయన వ్యక్తిగత భద్రత కూడా సమీక్ష చేసుకోవాలి. అదే టైంలో ప్రభుత్వం కూడా ఓ ప్రతిపక్ష నాయకుని భద్రత విషయంలో మరింత శ్రద్ధ చూపాల్సిఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: