వైసిపి నేతలు అలాగనే అనుమానిస్తున్నారు. ఆపరేషన్ గరుడ లేదు ఏమీ లేదని కొట్టిపాడేస్తున్నారు. ఆపరేషన్ గరుడ పేరుతో నటుడు శివాజితో మాట్లాడిస్తున్నది చంద్రబాబేనంటూ వైసిపి మాజీ ఎంపి, సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి, సినీనటుడు పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. పాలనలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికే శివాజీతో చంద్రబాబు మాట్లాడిస్తున్నట్లు చెప్పారు. జగన్ పై దాడి వెనుక కూడా చంద్రబాబుదే ప్రధాన పాత్ర ఉందని తేల్చేశారు.


జగన్ పై దాడి జరిగిన గంటలోనే నిందితుడు శ్రీనివాస్ ది ఏ కులం, ఏ ప్రాంతం, ఏ పార్టీకి చెందిన వ్యక్తి,  ఎందుకు దాడి చేశారు లాంటి విషయాలను డిజిపి ఆర్ ఫి ఠాకూర్ అంత అత్యుత్సాహంతో ఎందుకు ప్రకటన చేశారని వాళ్ళు అడుగుతున్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా ? ఘటన జరిగిన గంటలోనే నిందితుడు జగన్ అభిమాని అని కేవలం ప్రచారం కోసమే కత్తితో దాడి చేశాడని డిజిపి చెప్పటాన్ని వైవి, పోసాని తప్పుపట్టారు. శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఏం చెప్పాలో కూడా పోలీసులే చెప్పించి ఉంటారని నేతలిద్దరూ అనుమానిస్తున్నారు.


దాడి ఘటన తర్వాత డిజిపి, మంత్రులు, చంద్రబాబు చెప్పిన మాటలపై వైవి, పోసాని విరుచుకుపడ్డారు. అసలు నిందుతుడు తెలుగుదేశంపార్టీకి చెందిన యువకుడుగా చెప్పారు. వాళ్ళ కుటుంబమంతా ప్రస్తుతం టిడిపిలోనే ఉన్నారని తెలిపారు. వాళ్ళ కుటుంబమంతా టిడిపిలో ఉన్నారు కాబట్టే నాలుగు నెలల్లో రెండు ఇళ్ళు మంజూరైనట్లు వివరించారు. నిందుతుడు, కుటుబం మొత్తం వైసిపి అభిమానులైతే ప్రభుత్వం రెండు ఇళ్ళను ఎలా మంజూరు చేసిందంటూ మండిపడ్డారు. అందుకనే జరిగిన దాడి ఘటనపై కేంద్రప్రభుత్వ దర్యాప్తు సంస్ధల ద్వారానే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని స్పష్టంగా చెప్పటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: