రాజశేఖర్ రెడ్డి కుటుంబానికీ , రాజశేఖర్ రెడ్డి కీ ఆయనకంటే ఆయన కొడుకు - ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కి దగ్గర మనిశులు కొందరే ఉంటారు. అలాంటి వారి లో మచిలీపట్నం అప్పటి ఎమ్మెల్యే పేర్ని నాని కూడా ఒకరు.  పేర్ని వెంకటరామయ్య - పేర్ని నానీ .. ఈయన కాంగ్రెస్ తరఫున రాజశేఖర్ రెడ్డి నాయకత్వం లో రెండు సార్లు వరసగా 2004 లో 2009 లో ఎమ్మెల్యే గా గెలిచి ప్రజలకి సేవలు అందించారు. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా మచిలీపట్నం లోనే కాకుండా కృష్ణా జిల్లాలో కూడా వైకాపా తరఫున నిలబడ్డారు.  జగన్ మోహన్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తోంది అన్న టైం లో సరైన సమయానికి స్పందించిన నేత నాని అని చెప్పాలి.  అప్పట్లో చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని  కలిసి ముందుకు వెళదాం అని మాట ఇచ్చారు నాని. అప్పటి నుంచీ జగన్ తోనే ఉన్న నాని కి మాస్ జనాలలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది . నియేజకవర్గం లో మున్సిపల్‌ కార్మికులపై పోలీసుల ఉక్కుపాదం మోపిన తరుణం లో మాస్ జనాలతో , కార్మికులతో ఆయన నిలిచిన తీరు ఇప్పటికీ ఆ ప్రాంతం లో గొప్పగా చెప్పుకుంటారు. .. వామపక్ష ట్రేడ్ యూనియన్ నేతలతో పాటు తాను కూడా అరస్ట్ అయ్యి కార్మికుల పట్ల తనకి ఉన్న అంకితభావం అప్పట్లోనే  చాటుకున్నారు ఆయన.
Image may contain: 7 people, people smiling, people standing

జిల్లా వ్యాప్తంగా అప్పట్లో జరిగిన సమ్మె కి నాని వేసిన ప్రణాళిక చాలా బాగా సక్సెస్ అయ్యి పదమూడు రోజుల పాటు నేషనల్ మీడియా లో సైతం నానేలా చేసింది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో మొదటి నుంచీ తనదైన ముద్ర వేసుకున్న నాని గత ఎన్నికల్లో ఓడిపోవడానికి మోడీ వేవ్ కారణం అని చెబుతూ ఉంటారు స్థానికులు. కోల్లు రవీంద్ర కి కేవలం ధన బలం ఉంది తప్ప అనుచర గణం కానీ , ప్రజల్లో అభిమానం కానీ తక్కువ అలాంటి వ్యక్తి నాని మీద గెలిచారు అంటే అదంతా మోడీ వేవ్ , తెలుగుదేశం వేవ్ అనే లోకల్ సీనియర్ రిపోర్టర్ లు చెప్పే మాట. గత ఎన్నికల్లో టీడీపీ గెలుపు తరవాత అనేకమంది వైకాపా లోంచి జంప్ చేసినా జగన్ కి అత్యంత నమ్మకస్తుడుగా ఉండే నాని ఇప్పటికీ జగన్ కి నమ్మిన వ్యక్తిగా వైకాపా లోనే ఉండడం కాకుండా కృష్ణా జిల్లా లో వైకాపా గెలుపుకోసం ప్రణాలికలు రచిస్తూ ఉండడం విశేషం. 

Image may contain: 1 person
కృష్ణా జిల్లా వ్యాప్తంగా వచ్చే ఎన్నికల్లో తన పార్టీ వైఎస్సార్ సీపీ ని గెలిపించి జగన్ మోహన్ రెడ్డి కి పదిహేను స్థానాల్లో కనీసం తొమ్మిది స్థానాలు బహుమతిగా ఇవ్వాలి అని ముఖ్యంగా గత ఎన్నికల్లో కోల్పోయిన మచిలీపట్నం ని మళ్ళీ జగన్ చేతిలో పెట్టాలి అని నాని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దీనికోసం అహర్నిశలూ కష్టపడుతూ శ్రమిస్తున్నారు నాని. పక్కా వ్యూహాలతో, జగన్ సమీకరణలతో, అన్ని వర్గాలు - కులాలు - మతాల వారిని దగ్గర చేసుకుంటూ ఒక అద్భుత మాస్ లీడర్ గా ఎదిగారు ఆయన. ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’అనే నినాదం కృష్ణా జిల్లా వ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేలా చేస్తోన్న నాని అతని అనుచర గణం, టీడీపీ ప్రభుత్వ దురాగతాల మీద ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి జనాలని జాగృతం చేస్తూ ఉంటారు.అధికార పక్షం పాలనలో  బందరు పోర్టు విషయం లో ఎన్ని అవకతవకలు జరిగాయి అనేది మచిలీపట్నం ప్రజలకి, కృష్ణా జిల్లా ప్రజలకి పూసా గుచ్చినట్టు గా తెలిసింది అంటే అది నాని యొక్క ప్రణాళిక లో భాగం అనే చెప్పాలి.‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ జగన్ వస్తే ఏం చేస్తాడు ఇలాంటివి చక్కగా జనం లోకి తీసుకుని వెళుతున్నారు ఆయన.
Image result for perni nani

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగేలా చేసారు .. మొన్న జరిగిన తిత్లీ తుఫాని విషయం లో సైతం తనదైన శైలి లో సహాయం అందించిన నాని .. రీసెంట్ గా జగన్ మీద జరిగిన దాడి ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రం లో అధికార పక్షం నిద్రపోతోంది అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అంటూ ఏకి పడేసారు ఆయన. జిల్లా వ్యాప్తంగా జగన్ కి మద్దతు తెలుపుతూ ప్రభుత్వం మీద నిరసనలు తెలియజేసే కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొన్నారు పేర్ని నాని. మాస్ లీడర్ గా ఎదిగిన నాని వచ్చే ఎన్నికల్లో వైకాపా కి తన జిల్లాలో తొమ్మిది సీట్లు మినిమం టార్గెట్ తో రంగం లోకి దిగుతున్నారు..
ఇక చూడాలి రవీంద్ర vs నాని ల టఫ్ ఫైట్ అంటూ పొలిటికల్ విశ్లేషకులు ఈ మచిలీపట్నం నియోజికవర్గం గురించి మాట్లాడుకుంటున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే పైన ఉన్న వ్యతిరేకత, యాంటీ incubency, ప్రజల్లో నాని మీద ఉన్న నమ్మకం, అధికారం లో ఉన్నప్పుడు చేసిన మంచి పనులు ఇవే ఈ సారి నాని ని మళ్ళీ నిలబెడతాయి అంటున్నారు. తన ప్రాంతం లో గెలుపు, తన సీటు సంగతి మాత్రమే కాకుండా జిల్లా వ్యాప్తంగా 9 సీట్లు అయినా గెలిపించి బహుమతి ఇవ్వాలి అనేది నాని ధృడ సంకల్పం అని అతని సన్నిహితులు చెబుతోన్న మాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: