చంద్రబాబు మళ్లీ డ్రామా మొదలెట్టాడు. ఇక్కడ జగన్ పై హత్యాయత్నం తెలుగుదేశం వారి పాత్ర ఉందని ఖచ్చితంగా తేలటంతో సినిమా యూనిట్ ను దేశ రాజధానికి మార్చేశాడు. ఇక మొత్తం జనందృష్టిని "ఆపరేషణ్ గరుడ..ఆపరేషణ్ ద్రవిడ..ఆపరేషణ్ రాక్షస" అంటూ డిల్లీ పురవీధుల్లో నాటకాలు వేయటం తప్ప చేసే దేమీ లేదు. జనం చంద్రబాబు ప్రతిపక్షాలను "బ్లేం గేం" ను  "ఆపరేషన్ ఎల్లో" పేరుతో తన దైన శైలిలో ప్రారంభించబోతున్నాడు.

సంబంధిత చిత్రం

ఇప్పుడు దేశం దృష్టి ఎలా తగలడ్దా ఏపిలో ప్రజల దృష్టంతా చంద్రబాబు చిల్లర వేషాలపై కేంద్రీకరిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ సృష్టికర్త నందమూరి తారక రామారావు నాటకాల నుండి ఎదగటం ఆయన సహజసిద్ధమైన నాటకానుభవాన్ని రంగరించి 'తెలుగు దేశం పార్టీ' ని స్థాపించినా అది తనలోని అసలు నాటకాల  జీన్స్ తో 'తెలుగు డ్రామా పార్టీ' గా ఎదిగింది.

chandrababu blame game కోసం చిత్ర ఫలితం

ఇక అప్పటి నుండి ప్రజలు నాటకాలను నిజజీవితంలో రుచిచూస్తూ చూస్తూ వెగటు కలిగింది. బాబెన్ని వేషాలు వేసినా ఆయన మూలాలు కాంగ్రెస్ వే కావటంతో "యూ-టర్న్స్" తీసుకుంటూ అడ్డుదార్లలో ప్రతి సారి వేరే పార్టీల మద్దతుతో అధికారంలోకి వస్తూ స్వంతంగా ఎదగలేని జవసత్వాలతో టిడిపి తయారైంది. ఆయన ఆద్వర్యంలోని టిడిపి ఎన్ని పార్టీలతోనో జతకడుతూ ఇప్పటివరకు అక్రమ రాజకీయ సంసారం చేస్తూ వచ్చింది. ఇక ఈపార్టీకి మిగిలింది తన ఆగర్భశత్రువైన కాంగ్రెస్ మాత్రమే. తనకు రాష్ట్రంలోరాజకీయ గెలుపు కోసం జతకట్టటానికి మిగిలింది కాంగ్రెస్ మాత్రమే.

chandrababu blame game కోసం చిత్ర ఫలితం

ప్రతిపక్షాలు తిరస్కరించటం, రాష్ట్రంలో ప్రతిపక్షాలు బలపడి శరవేగంగా ఎదుగుతూ ఉండటంతో దిక్కుతోచ ని టిడిపికి ప్రతిపక్ష వైసిపి ఆధినేత జగన్మోహనరెడ్దిపై జరిగిన హత్యాయత్నం ఆపై ఆయన పట్ల తమ ప్రభుత్వం స్వయానా తాను ప్రవర్తించిన తీరు ఆత్మహత్యా సదృశంగా మారటంతో - విషయాన్ని దారి మళ్లించటానికి - పబ్లిక్ అటెన్షన్ తనవైపు తిప్పుకోవటానికి - డిల్లీ పురవీదుల్లో జాతీయ మీడియా సాక్షిగా, తన కలగూరగంప పార్టీల అధినేతల సమక్షంలో బిజెపికి వ్యతిరేఖంగా చేయబోయే 'వీధి గారడీ'కి తెరతీయ బోతున్నారు.

chandrababu blame game కోసం చిత్ర ఫలితం

ప్రతిపక్ష నేత జగన్‌మోహనరెడ్దిపై జరిగిన హత్యాయత్నం విషయంలో ఇప్పటికే కొనసాగిస్తున్న ఎదురు దాడిని ఇంకా ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ శ్రేణులకు ఆదేశాలు జారిచేశారట. ప్రజలను గందరగోళానికి గురిచేసే విధంగా మూకుమ్మడిగా అమరావతిలో, అన్ని జిల్లాల్లో పచ్చమీడియా సమావేశాలు నిర్వహించాలని, జగన్‌మోహనరెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించాలంటూ చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఒకవైపు కలెక్టర్ల సమావేశం జరుగుతుండగానే శుక్రవారం చంద్రబాబు మంత్రులు, టీడీపీ నాయకులకు ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. హత్యాయత్నం విషయంలో జగన్‌మోహన్‌రెడ్డికి సానుభూతి రాకుండా చేయాలని, ఒక వ్యూహం ప్రకారం విమర్శల తీవ్రతను పెంచాలని చెప్పినట్లు తెలిసింది.


టీడీపీ నేతలు మాట్లాడాల్సిన పాయింట్లు, సమాచారాన్ని అందించే బాధ్యతను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) లోని ఇద్దరు ముఖ్య అధికారులు, ఇంటెలిజెన్స్‌-చీఫ్‌కు అప్పగించినట్లు సమాచారం. వారు అను క్షణం టీడీపీ నాలెడ్జ్‌ సెంటర్, ఇతర మార్గాల ద్వారా రకరకాల పుకార్లు, ఎదురు దాడి వ్యూహాలను రూపొందించి వాటిని మంత్రులు, టీడీపీ అధికార ప్రతినిధులు, ఇతర ముఖ్యనాయకులకు చేరవేస్తున్నారు. ఎవరు ఏయే అంశాలు మాట్లాడాలో సూచిస్తూ తయారు చేసిన నోట్‌ ను టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి నాయకులందరికీ పంపించారు. వాటి ఆధారంగా మంత్రులు, టీడీపీ నాయకులు న్యూస్‌ బులిటెన్లు ఉన్న సమయంలో కలెక్టర్ల సమావేశం నుంచి బయటకు వచ్చి మాట్లాడారు. మధ్యలో చంద్రబాబు నాయుడు వారికి కొన్ని సూచనలు చేశారని సమాచారం.

chandrababu blame game కోసం చిత్ర ఫలితం

అసలు జగన్ పై హత్యాయత్న వాస్తవం ప్రజలకు తెలియకుండా రకరకాల ఆరోపణలు ముందుగానే ప్రణాళికా బద్ధంగా చేయాలని, జగన్‌మోహనరెడ్డి వీరాభిమానే ఈ దాడి చేశాడంటూ పదేపదే చెప్పటం ద్వారా ప్రజలకు వస్తావాలకు తెలియకుండా గందరగోళం సృష్టించాలని చంద్రబాబు పేర్కొన్నారు. జగన్మోహనరెడ్ది ఆంధ్రప్రదేస్ పోలీసులకు సహకరించడంలేదని ప్రచారం ముమ్మరంగా చేయాలని, వాంగ్మూలం ఇవ్వకుండా నిరాకరించడం ద్వారా రాష్ట్ర పోలీసులను అవమానించారని పదేపదే వేల గొంతుక లతో చెప్పాలని, తద్వారా ప్రాంతీయ అభిమానాన్ని కూడా రెచ్చగొట్టాలని సూచించినట్లు సమా చారం. అందుకనుగుణంగా పలువురు మంత్రులు బయట కు వచ్చి మాట్లాడారు.

chandrababu blame game కోసం చిత్ర ఫలితం

జగన్‌మోహనరెడ్ది ఏపీ పోలీసులను కించపరిచాడనే ప్రచారాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అందుకున్నారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందు కు గవర్నర్ల వ్యవస్థ పై పోరాటం పేరుతో హడావుడి చేయాలని చంద్రబాబు నిర్ణయించడం గమనార్హం. ఈ ప్రచారాలన్నింటినీ తమ అనుకూల పచ్చ మీడియాలో హైలెట్‌ అయ్యేలా చూసే బాధ్యతను పలువురు ముఖ్యనేతలకు అప్పగించారు. ఒక పకడ్బందీ వ్యూహం ప్రకారం ఇవన్నీ చేయిస్తున్న చంద్రబాబు తన ఆంతరంగికుల వద్ద జగన్మోహనరెడ్దికి సానుభూతి రాకుండా చూడడమే ముఖ్యమని, హత్యాయత్నం వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఇంకేమైనా మార్గాలున్నాయో అన్వేషించాలని  కోరినట్లు సమాచారం.  



ఏపిలో చంద్రబాబును కాంగ్రెస్ తప్ప అన్నీ పార్టీలు అంటరాని పార్టీగా చూస్తున్నాయి. దాంతో ఆయన పూర్తిగా డిప్రెషన్ లో పడిపోయి, ప్రతిపక్షనేత పట్ల రాజకీయాలు వదిలేసి జాలి, సానుభూతి చూపాల్సిన తరుణంలో ఆయనపై కక్ష ప్రదర్శించటం చంద్రబాబుపై రాష్ట్రమంతా వ్యతిరేఖత పెల్లుబుకుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: