ఆంధ్ర ప్రదేశ్ కి తమిళనాడు ఆదర్శమవుతోందా. అక్కడ రాజకీయ సంస్క్రుతి మన వాళ్ళకు అబ్బిందా. అదే తీరుని ఇక్కడా కొనసాగిస్తారా అన్నింటా రాజకీయమే తప్ప మరొకటి ఆలోచించే ఓపిక, తీరిక, సహనం ఉండవా. వ్యక్తిగత ద్వేషాలు, ఇగోలకే పెద్ద పీట వేస్తారా, నాడు అలిపిరి వద్ద అప్పటి చంద్రబాబు మావోయిస్టుల దాడికి గురైతే ప్రతిపక్ష నేత వైఎస్ కన్నీళ్ళు పెట్టుకున్నారు. వెంటనే పరుగున వెళ్ళి తిరుపతిలో బాబును పరామరించారు. మావోలకు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలతో నిరసనలో పాలుపంచుకున్నారు. మళ్ళీ అటువంటి మావవత్వపు రాజకీయాలు ఏపీలో చూడగలమా


జగన్ ని పలకరించని ప్రభుత్వం :


హుందా అయినా రాజకీయం చేస్తున్నాను, నలభయేళ్ళ అనుభవం నాకుంది, చెన్నారెడ్డి నుంచి ఎందరినో చూసిన వాణ్ణి ఇదీ నిత్యం మన ముఖ్యమంత్రి చెప్పే కబుర్లు. ఇందులో అన్నీ నిజాలే కానీ ఆచరణలో ఎక్కడైనా ఆ అనుభవం, హుందాతనం కనిపిస్తోందా. రాజకీయాలనే ఆశ, శ్వాసగా టీడీపీ ముందుకు సాగుతోంది. ఇది ఎంతవరకూ వెళ్ళిందంటే కత్తి గాటుకు గురై తీవ్ర రక్త స్రావం అయిన వైసీపీ అధినేత జగన్ ని కనీసం పరామర్శించేందుకు కూడా ముఖ్యమంత్రికి, మంత్రులకు అహం అడ్డువచ్చేంతగా. పొరుగున ఉన్న తెలంగాణా సీఎం కేసీయార్ ఫోన్ లో పరామర్శించారు. మరి ఏపీ సీఎం తన బాధ్యతను గుర్తించారా


పుండు రేపుతున్నారుగా :


పోనీ పరామర్శ లేదు, రాజకీయమే చూసుకున్నారనుకున్నా లేని పోనీ విమర్శలు చెస్తూ పుండు మీద కారం జల్లుతున్నారుగా. జగన్ తానే ఈ దాడి చేయించుకున్నారని నిస్సిగ్గుగా టీడీపీ మంత్రులు చెబుతున్నారంటే   అంతకంటే దారుణం ఉంటుందా. పైగా ఇది జగన్నాటకమని, సెల్ఫ్ గోల్ అంటూ మంత్రులు గంటా శ్రీనివాసవారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారు పెద్ద నోరు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ రాజకీయాలు చూసిన వారికి ఏహ్య భావమే కలుగుతోంది. కష్టాల్లోనైనా మానవత్వం  చూపించారా అంటూ సగటు జనం ప్రశ్నలు వినిపించనంతగా నేతలు ప్రవర్స్తిస్తున్నారు.


అక్కడ మారుతోంది :


చిత్రమేంటంటే తమిళ నాట మెల్లగా వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాల సంస్ర్కుతి మారుతూ వస్తోంది, జయలలిత, కరుణానిధి ఇద్దరు ఇపుడు భౌతికంగా లేరు. మిగిలిన వారు అలా ఉండలేరు కూడా. స్టాలిన్ తండ్రి వారసత్వాన్ని తీసుకున్నా పరిణిత నాయకుడిగానే వ్యవహరిస్తున్నారు. ఇక అన్నా డీఎంకే లో కీలక నాయకులు అనదగ్గ వారు లేరు. మొత్తానికి తమిళనాడు ఇపుడు ప్రశాంతంగా ఉంది. ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ఇది ఎంత కాలం సాగుతుంది, ఇలాగే తమ వారసులను కూడా తయారు చేస్తున్నారా అన్న దాని బట్టే రాష్ట్ర రాజకీయాల తీరు మారే అవకాశం ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: