ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఆగడాలు మితిమీరి పోతున్నాయని..టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పూర్తిగా పట్టించుకోవడం మానేశారని..ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడలో పూర్తిగా విఫలం చెందారని ఇప్పటికీ ప్రజలను అధికార పార్టీ మోసగించే విధంగా మాట్లాడుతున్నారని ప్రజల్లో చైతన్యం నింపడానికి వైసీపీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘ప్రజా సంకల్ప యాత్ర’ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 

మూడు వేల కిలోమీటర్ల దాటి పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ కి అడుగడుగునా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.  సాక్షాత్తు రాజన్నే తమ కళ్ల ముందు కనిపించినట్లు అనిపిస్తుందని అంటున్నారు.  ఎన్ని అవాంతరాలు వచ్చినా..అడ్డంకులు వచ్చినా..జగన్ పాదయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు.  కాగా, రెండు రోజుల క్రితం వైఎస్ జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి నేపథ్యంలో, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. 
Image result for జగన్ పాదయాత్రకు తాత్కాలిక విరామం
ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు శని, ఆదివారాలు విరామం ప్రకటించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ తెలిపారు.  నివేదిక అందిన తర్వాత వైద్యుల సూచనల మేరకు, పార్టీ నేతలు సమావేశమై పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయంపై స్పష్టమైన సమాచారం అందిస్తామని తెలిపారు.    


మరింత సమాచారం తెలుసుకోండి: