విశాఖపట్నం విమానాశ్రయంలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం నేపధ్యంలో వైసిపి సోషల్ మీడియా విభాగం పెద్ద అండగా నిలిచింది. హత్యాయత్నం జరిగిన అర్ధగంట నుండే డిజిపి ఆర్ పి ఠాకూర్, మంత్రులు, తర్వాత చంద్రబాబునాయుడు చేసిన ఎదురుదాడిని వైసిపి నేతలు సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారంటే అందుకు సోషల్ మీడియా విభాగం అందించిన పూర్తి మద్దతే ప్రధాన కారణమని చెప్పాలి. హత్యాయత్నం ఎందుకు జరిగింది ? ఎవరు చేయించారు ? అనేవి విచారణలో తేలాల్సిన అంశాలు .

 

కానీ ఘటన జరిగిన అర్ధగంటలోనే డిజిపి పెద్ద డ్రామాకు తెరలేపారు. దాడి చేసింది జగన్ అభిమానే అని తేల్చేశారు. సానుభూతితో వైసిపి అధికారంలోకి రావాలన్న ఉద్దేశ్యంతోనే తాను నిందితుడు దాడి  చేశారని సూత్రీకరించేశారు. పైగా నిందితుడు శ్రీనివాస్ ఎస్సీ కులమని కూడా చెప్పేశారు. నిజానికి ఇవన్నీ అప్పటికప్పుడు డిజిపి చెప్పాల్సిన పనిలేదు. అయినా చెప్పారంటే, జరిగిన ఘటనను ఎవరి మెడకు చుట్టాలని అనుకుంటున్నరో అందరికీ అర్ధమైపోయింది. డిజిపిని అడ్డంపెట్టుకుని తెరవెనుక చంద్రబాబునాయుడే డ్రామాకు తెరలేపారని వైసిపి  నేతలు ఆరోపణలు మొదలుపెట్టారు.

 

ఇక్కడే వైసిపి సోషల్ మీడియా విభాగం రంగంలోకి దిగింది. జగన్ పై జరిగిన దాడి ఘటన, ఘటన తాలూకు ఫొటోలు బయటకు వచ్చాయంటే సోషల్ మీడియా పుణ్యమే. అలాగే నిందితుడు వివరాలు, ఎక్కడ పనిచేస్తున్నాడు, అతని నేపధ్యం ఏమిటి ? ఎప్పుడో జగన్ తో కలిసి నిందితుడు తయారుచేసిన ఫ్లెక్సీ ని ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే, ఆ ఫ్లెక్సీ ఫేక్ ఫ్లెక్సీ అంటూ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారంలోకి తెచ్చింది.  


అదే సమయంలో జగన్ ను ఉద్దేశించి, జగన్ పై దాడి విషయంలోను చంద్రబాబు ఉపయోగించిన పదజాలాన్ని, మాట్లాడిన మాటలను సోషల్ మీడియా చీల్చి చెండాడేసింది. చంద్రబాబు, మంత్రులు చెప్పిన ప్రతీ మాట ఎలా తప్పు నిరూపించింది. చంద్రబాబుపై అలిపిరిలో మావోయిస్టులు జరిపిన దాడి ఘటన సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవర్తించిన తీరును, ఇపుడు జగన్ పై దాడి విషయంలో చంద్రబాబు మాట్లాడుతున్న మాటలను సోషల్ మీడియానే దుమ్ముదులిపేస్తోంది.

 

నిజానికి వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సోషల్ మీడియాను బలోపేతం చేయాలని జగన్ అనుకున్నారు. పోయిన ఎన్నికల్లో జరిగిన పొరబాటు ఈసారి జరక్కుండా అవసరమైన చర్యలు  తీసుకోవాలని అనుకున్నారు. ఇప్పటికే జగన్ కు మద్దతుగా సోషల్ మీడియాలో అంటే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం, వాట్సప్ తదితర మార్గాల్లో వందలు, వేలాది గ్రూపులు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి.

 

అయితే, అది సరిపోదన్న ఉద్దేశ్యంతోనే ప్రతీ మండలంలోను వైసిపి తరపున సోషల్ మీడియా విభాగాన్ని పటిష్టం చేయటానికి 15 మంది చురుక్కుగా ఉండే యువకులతో కమిటీలు వేశారు. కాకపోతే హఠాత్తుగా జరిగిన హత్యాయత్నం ఘటనతో సోషల్ మీడియా విభాగం మరింత స్పీడుతో రెచ్చిపోతోంది. సోషల్ మీడియా విభాగం మద్దతే లేకపోతే జగన్ కు మద్దతు ఈస్ధాయిలో లభించేది కష్టమనే చెప్పాలి.

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: