ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదోళన వ్యక్తం చేశారు. ఈ రోజు డిల్లీలో కాన్సిస్ ట్యూషన్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన బాబు మోడీపై అటాక్ చేశారు. ఎందుకు ఏపీపై పగ పట్టారంటూ బాబు ప్రశ్నించారు. అక్కడ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాబు వాపోయారు.


ఏపీపై కక్ష : 


ఏపీపై కక్షకట్టినట్లుగా కేంద్రంలోని బీజేపీ వ్యవహ‌రిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. విశాఖలో ఓ వైపు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్  మరో వైపు ఫిన్  టెక్ సదస్సు జరుగుతూంటే కోరి మరీ విశాఖ విమానాశ్రయంలో విపక్ష నేత జగన్ పై దాడి ఘటనను ముందుకు తెచ్చారని బాబు ఆరోపించారు. దీనివల్ల అక్కడ శాంతి  భద్రతలు సరిగా లేవని చెప్పడానికి పన్నిన పధకమని బాబు అన్నారు.


ఐటీ దాడులు చేశారు :


మరో వైపు ఏపీలో పలు ప్రాంతాలలో ఐటీ దాడులు చేయించడం ద్వారా వ్యాపార పారిశ్రామిక వర్గాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్రబాబు ఆందోళన చెందారు. దీని వల్ల ప్రజ‌లలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఎవరూ పెట్టుబడులు పెట్టరని బాబు చెప్పుకొచ్చారు. ఏదో విధంగా ఏపీని అస్థిరపరచాలని చూస్తున్నారని బాబు విమర్శించారు.  ఇది మంచి విధానం కాదని ఆయన అన్నారు. 


సంక్షోభాలు ఎన్నో చూశాం :


ఏపీకి సంబంధించి తెలుగుదేశం పర్టీ ఎన్నో సంక్షోభానలు చవి చూసిందని, మళ్ళీ విజయవంతంగా నిలబడిందని చంద్రబాబు చెప్పారు. మాకు ఇవి కొత్త కాదని అన్నారు. జగన్ పై దాడి పూర్తిగా కేంద్రం వైఫల్యమని చంద్రబాబు ఆరోపించారు. దాన్ని కూడా మాకే అంటగడుతున్నారని అన్నారు.


గుజరాతీలదేనా దేశం :


ఎన్నడూ లేని విధంగా బాబు గుజరాతీయులపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒకే రాష్ట్రం నుంచి ప్రధాని, పార్టీ అధ్యక్షుడు ఉండొచ్చా అంటూ కొత్త పాయింట్ లేవనెత్తారు. కేంద్రంలో కూడా కీలకమైన స్థానాల్లో ఆ రాష్ట్రం వాళ్ళే ఉన్నారని బాబు అన్నారు. సీబీఐ వివాదం మోడీ వైఫల్యమని, దానికి ఆయనే సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 


ఒకే పార్టీ వద్దు :


దేశానికి ఏక పార్టీ వ్యవస్థ మంచిది కాదని బాబు అన్నారు. మోడీకి పూర్తి మెజారిటీ రావడం వల్లనే నచ్చని వాళ్ళను వేధిస్తున్నారని చంద్రబాబు అన్నారు. కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నా, ఏ తప్పు తాను చేయలేదని చంద్రబాబు చెప్పారు. మొత్తానికి డిల్లీ టూర్లో బాబు మోడీపైన, గుజరాత్ పైనా కూడా వాడీ వేడిగా దాడి చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: