తాజాగా ఇటీవల విశాఖపట్టణం విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి కేసు విచారణను తెలుగుదేశం ప్రభుత్వం సిట్ కు అత్త కి ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ కు ఇచ్చిన విచారణపై నమ్మకం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో జరిగిన దాడి ఘటన గురించి సంచలన నిర్ణయం తీసుకున్నారు వైసీపీ పార్టీకి చెందిన నాయకులు.

Related image

ఆదివారం వైసిపి నేతలంతా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి మరియు అదే విధంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కలిసి జరిగిన ఘటనపై విచారణ చేయించాలని ..ఇది కావాలని అధికారపార్టీ దురుద్దేశంతో జగన్ పై చేయించారని ఫిర్యాదు చేయడానికి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ తరపున 15 మంది నేతలు ఢిల్లీ వెళ్ళబోతున్నరు.

Image result for ys jagan attack

త‌మ అధినేత జ‌గ‌న్ ఘ‌ట‌న పై ద‌ర్యాప్తుకోసం ఏర్పాటు చేసిన సిట్ పై త‌మ‌కు న‌మ్మ‌కం లేద‌ని.. ఏదైనా స్వ‌తంత్ర సంస్థ‌తో విచార‌ణ జ‌రిపించాల‌ని వైసీపీ నేత‌లు కోర‌నున్నార‌ని స‌మాచారం.

Image result for ys jagan attack

ఇక జ‌గ‌న్ పై హ‌త్యాయ‌త్నం జ‌రిగిన త‌ర్వాత అధికార టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా, జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి పై విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసిన టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్య‌క‌ర్త‌ల‌కు సంబంధించిన వ్యాఖ్య‌ల సీడీల‌ను కూడా వైసీపీ ఇవ్వ‌నున్న ఫిర్యాదులో జ‌త‌చేసి కేంద్ర పెద్దలకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని తెలుగుదేశం పార్టీ నేతలు భయపడుతున్నట్లు ఆంధ్ర రాజకీయాల్లో టాక్.




మరింత సమాచారం తెలుసుకోండి: