తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబుది గురివింద వైఖరి. ఎదుటివారి తప్పులే ఆయనకు అనిపిస్తాయి. తన వెనకాల మాత్రం చూసుకోరు. ఈ రోజు డిల్లీ వెళ్ళిన చంద్రబాబు అక్కడ జాతీయ మీడియా ముందు ప్రజాస్వామ్యం అంటూ పెద్ద గొంతే చేసుకున్నారు. ఏపీలో ఖూనీ అయిపోతోందని బావురుమన్నారు. కేంద్రం దాడులు చేయిస్తోందని, తన సర్కార్ ని అస్థిరపరుస్తోందని కూడా గుండెలు బాదుకున్నారు. 


ఇదీ బాబు సూత్రీకరణ:


ఒకే రాష్ట్రం నుంచి ప్రధాని, పార్టీ అధ్యక్షుడు ఉండకూడదట. అది ప్రజాస్వామ్యానికే చేటు తెస్తుందట.  మోడీ, అమిత్ షా గుజరాత్ నుంచే ఉండడాన్ని బాబు ఆ విధంగా తప్పు పట్టారు. బాగానే ఉంది. కానీ మరి ఒకే నాయకుడు అటు ముఖ్యమంత్రిగా, ఇటు పార్టీ అధ్యక్షుడిగా ఉండొచ్చా. ఇక తండ్రి జాతీయ అధ్యక్షుడు, కొడుకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీని నడపొచ్చా. అపుడు ప్రజాస్వామ్యం ఉందనుకోవాలా అని సోషల్ మీడియా ఏకుతోంది ఓ వైపు.


కేంద్రంలో అంతా వాళ్ళేనట:


కేంద్ర ప్రభుత్వంలో ఒక రాష్ట్రం పెత్తనం అధికమైపోయిందంట. వివిధీ కీలక శాఖల్లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన వాళ్ళే ఉన్నరాట. ఇది కూడా మీడియా వేదికగా బాబు మోడీపైన సంధించిన మరో బాణం. మరి అమరావతిలో ఒకే ప్రాంతానికి చెందిన అధికారులు కీలక పోస్టుల్లో ఉన్నారు. దాని మాటేంటి బాబూ అంటూ కౌంటర్లు  పడుతున్నాయి. అంతే కాదు., ఏకంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి పెత్తనం కీలక స్థానాల్లో పెరిగిందని, వారిదే రాజ్యం అయిందని కూడా వస్తున్న విమర్శలకు బాబు గారు ఏం బదులిస్తారని కూడా సోషల్ మీడియా నిగ్గదీస్తోంది.


ఏక పార్టీ పాలన ఉండరాదట:


అంటే కలగూర గంపలా చీలికల పేలికల ప్రభుత్వాలు కేంద్రంలో రావాలా, ఒకటి రెండు సీట్లు ఉన్న వారు సైతం అలకలు, తగవులు పెడుతూ ఎపుడూ పాలనకు అవకాశం లేకుండా అస్థిర ప్రభుత్వమే అక్కడ పవర్లో ఉండాలా. ఫలితంగా ఏడాదికి ఒకమారు లోక్ సభకు ఎన్నికలు జరిగితే దేశాభివ్రుధ్ధి ఏమవుతుంది ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ బాబూ గారు అంటూ ప్రశ్నల  వర్షం కురుస్తోంది. ఇదే బాబు అప్పట్లో దేశం సుస్థిరంగా ఉండాలంటే మోడీని ఎన్నుకోవాలని నినదించిన సంగతి మరచిపోయారా అని అడుగుతున్నారు.


సెల్ఫ్ గోల్ బాబు:


జాతీయ మీడియా ముందుకొచ్చి కేంద్రంపై మోడీపై ఆరోపణలు చేయాలనుకున్న బాబు సెల్ఫ్ గోల్స్ వేసుకున్నారు.  విభజనకు కారణమైన కాంగ్రెస్ తో తెలంగాణాలో ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటే  సరైన జవాబు చెప్పలేకపోయారు. జగన్ పై అటాక్ కి సంబంధించి న్యాయ విచారణ జరిపిస్తారా అంటే అవసరం లేదన్న బాబు కుట్ర కోణం ఉందని చెప్పడం విశేషం, మరి ఆ కుట్రని చేదించవచ్చు కదా అంటే మాత్రం పారదర్శకంగా విచారణ జరిపిస్తామని  సమర్ధించుకున్నారు. దాడి జరిగిన గంటలోనే ఏపీ డీజీపీ ఠాకూర్ జగన్ అభిమాని చేసిన పని అంటూ తీర్పు ఇవ్వడాన్ని కూడా బాబు సమర్ధించుకోలేక ఇరకాటంలో పడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి: