ఇటీవల ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడిని ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..సినీ నటుడు శివాజీ గారు చెప్పినట్లు ఆపరేషన్ గరుడ లో భాగమేనని కామెంట్లు చేసిన సంగతి అందరికీ తెలిసినదే.

Image result for hero shivaji operation garuda

రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు జగన్ పై దాడి జరిగిన సమయంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ గరుడ వివరించిన సినీ నటుడు శివాజీ..జగన్ పై దాడి జరిగిన తర్వాత మొట్టమొదటి సారిగా ఓ టీవీ చానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

Image result for jagan vizag airport attack

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీని కూల్చడానికి ఒక కొత్త నాయకుడు..స్కెచ్ వేశారని అయితే అది ఫెయిల్ అయిందని తెలిపారు. జాతీయ పార్టీతో కలిసి పొరుగురాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఇరికించినట్టే ఇరికిద్దామనుకుని ఓ కొత్త నాయకుడు ప్లాన్ వేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Related image

అయితే అదికాస్త ఫెయిల్ అయ్యిందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని పడేయాలని చూశారన్నారు. త్వరలో ఆ కుట్ర బయటపెడతానని స్పష్టం చేశారు. అయితే ఆ కొత్త నాయకుడు ఎవరో అన్న విషయం గురించి స్పష్టత ఇవ్వలేదు శివాజీ.




మరింత సమాచారం తెలుసుకోండి: