నలభయ్యేళ్ల రాజకీయ జీవితాన్ని చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇపుడు తీవ్రమైన అభద్రతాభావానికి లోను అవుతున్నారా, ఆయనలో మునుపటి ధైర్యం, స్థైర్యం ఏమయ్యాయి. ఎన్నో సవాళ్ళను ధీటుగా ఎదుర్కొన్న ఆయన ఇపుడెందుకు కలవరపడుతున్నారు. చిగురుటాకులా ఏ చిన్న శ‌బ్దానికైనా ఎందుకు వణికిపోతున్నారు. బాబుకు నిజంగా ఏమైంది


సీనియర్ నాయకుడు :


నిజానికి చంద్రబాబు సీనియర్ నాయకుడు, దేశంలో అతి కొద్ది మందిలో ఆయన‌ కూడా ఒకరు. వ్యూహ రచనలో దిట్ట. అపర చాణక్యునిగా పేరు గడించిన వాడు. ఎన్నో యుధ్ధాల్లో ఆరితేరిన వీరుడు. మరి బాబు ఎందుకిలా వ్యవహిరుస్తున్నారు. ఇదే అందరిలోనూ కలుగుతున్న సందేహం. ఇపుడు కాకపోతే మరెపుడూ కాదన్న ఆత్రుత, ఆరాటం ఆయనలో కనిపిస్తోంది. ఆయన చూడని శిఖరాలు  లేవు, తాకని ఎత్తులు లేవు. ఉమ్మడి ఏపీలో తొమ్మిదేళ్ళు, ఇపుడు ఐదేళ్ళూ ఎలా చూసుకున్నా బాబు పద్నాలుగేళ్ళ పాటు ముఖ్యమంత్రి. ఆయనకు ఇంక చింత, బెంగ ఎందుకు


వారసుడు గురించేనా :


ఈ కోణంలో నుంచి చూసినపుడు మాత్రం బాబు భయాన్ని కొంతవరకు అర్ధం చేసుకోగలం. బాబుకు ఏపీ రాజకీయాల్లో సమ ఉజ్జీలు ఎవరూ లేరు. జగన్ ఎంతగా పోరాడుతున్నా బాబు తరువాత స్థానమే, ఇక ఏపీ తెరపై బాబు తప్పుకుంటే మాత్రం జగన్ అజేయుడే. ఆ సంగతి అంతా ఒప్పుకుంటారు. జగన్ కి సరిసాటి లోకేష్ కాడన్నది అందరికీ తెలిసిన విషయమే. బాబుకు కూడా ఇపుడు ఇదే బెంగ పట్టుకున్నట్లుంది. తాను ఎటూ సీఎంగా పని చేశారు. వారసుడు ఆ సీట్లో కుదురుకోవాలి. అందుకోసమే ఆయన వచ్చే ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.


గ్రాఫ్ పెంచుకున్న జగన్ :


ఇక వైసీపీ విషయానికి వస్తే జగన్ 2014లో పోలిస్తే రాజకీయంగా రాటు దేలారు. బాగా పరిణితి సాధించారు. జగన్ పట్ల జనంలోనూ పాజిటివ్ రియాక్షన్ వస్తోంది.  ఆయన పాదయాత్రకు మంచి స్పందన కూడా లభిస్తోంది. ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే జగన్ ని ఎన్నుకుందామన్న వారి శాతం ఎక్కువగానే ఉంది. దానికి తోడు అయిదేళ్ళ టీడీపీ పాలనలొ వ్యతిరేకత ఎలాగూ ంది. అందువల్ల ఎన్నికల్లో ఓటమి తప్పదన్న అంచానాలు ఏమైనా బాబు దగ్గర ఉండి ఉండాలి. అందువల్లనే అయన తరచూ భద్రతాభావానికి గురి అవుతున్నారనుకోవాలి.


గెలిస్తేనే ఫ్యూచర్ :


ఇక వచ్చే ఎన్నికలు చూసుకుంటే ఏ విధంగానైనా గెలిస్తేనే టీడీపీకి, లోకేష్ కి ఫ్యూచర్ ఉంది. ఈ సంగతి బాబుకు బాగా తెలుసు. పార్టీ సేఫ్ గా ఉండాలన్నా తన వారసుడికి సీఎం సీటు దక్కాలన్నా ఆ ఎన్నికలు చాల ముఖ్యం.  చూస్తే వాతావరణం వేరేగా ఉంది. అందువల్లనే బాబు తీవ్రంగా కలవరపడుతున్నారనుకోవాలి. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబుని అభిమానించే వారు సైతం బాబు ధోరణికి విస్తుపోతున్నారు. ఎన్నికలు ఎన్ని బాబు చూడలేదు. రేపటి రోజున పరిణామాలు ఎలా వున్నా ధీటుగా ఎదుర్కొనేందుకు బాబు సమాయత్తం కావాలని హితైషులు కోరుకుంటున్నారు. కానీ బాబు లో మాత్రం ఆ అభద్రతాభావాం రోజురోజుకూ పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: