ఇపుడు చంద్రబాబు, నరేంద్ర మోడీల మధ్య యుధ్ధం తారాస్థాయికి చేరుకుంది. ఏపీ, డిల్లీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నిన్నటి దోస్తులు నేడు దుష్మన్లు అయ్యారు. మోడీ పేరు ఎత్తితే బాబు కస్సుమంటున్నారు. అంతా ఆయనే చేశారంటున్నారు. ఇక ఏపీ విషయంపైన కేంద్రం కూడా సీరియస్ గా ఉన్నట్లుగా న్యూస్ అయితే వస్తోంది. ఓ వైపు ఐటీ దాడులు, మరో వైపు విపస్ఖాల దూకుడు, ఇంకో వైపు గవర్నర్ నివేదికలు, ఎపుడేం జరుగుతుందో తెలియని స్థితిలో ఉంది.


అస్థిరం నిజమేనా :


బాబు డిల్లీలో మీడియాతో చెప్పినట్లుగా ఏపీని అస్థిరం చేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నం చేస్తోందా. ఈ ప్రశ్నకు  సమాధానం సులువుగా దొరకదు. కానీ ఆ దిశగా ఏమైనా జరుగుతున్నాయన్న అనుమానాలు మాత్రం టీడీపీ పెంచి పోషిస్తోంది. నిజానికి బీజేపీకి మోడీకి ఏపీ అంటే పెద్ద లెక్కలోనిది కాదు. వారి తల నొప్పులు వారికి ఉన్నాయి. దేశంలో ఇపుడు బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ వారు చేయాల్సింది చాలా ఉంది. మరి ఈ టైంలో ఇలా చేస్తారా


రాజకీయంగా ఆత్మహత్య :


ఏపీ సర్కారుకు మరో అరు నెలల్లో గడువు తీరబోతోంది. ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రజల తీర్పు కోరాలి. ఎలా అనుకున్నా ఎన్నికలు ముంగిట్లో పెట్టుకుని ఏ కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడం అన్నది జరగదు. పైగా మోడీ నెత్రుత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎన్నికలు ఉన్నాయి. ఏపీలో కనుక ఈ టైంలో రాష్ట్రపతి పాలన వంటివి విధిస్తే ఆ ప్రభావం  డైరెక్ట్ గా కేంద్రంపైన పడుతుంది. అది నెగెటివ్ రియాక్షన్ కి దారితీస్తుంది. ఆక్కడ జాతీయ స్థాయిలోనూ ప్రతిపక్షాలు ఏకమవుతాయి. ఇక ఏపీలో తీసుకుంటే  అలా కనుక చేస్తే బాబు నెత్తిన పాలు పోసిన వాడే మోడీ అవుతారు. బాబు ప్రభుత్వం కూలదోస్తే ఆ సానుభూతితో చంద్రబాబు హ్యాపీగా జనం మద్దతు పొంది గెలుస్తారు. ఇది కదా సామన్యునికి కూడా అర్ధమయ్యే రాజకీయం.


మరి ఎందుకు చిందులు :


ఇంతటి సున్నితమైన అంశాలు ఎన్నో రాష్రపతి పాలన విధించాలంటే ఉన్నాయి. ఆ సంగతి  బాబు కంటే ఎవరికీ  ఎక్కువగా తెలియవు కూడా మరి అన్నీ తెలిసి చంద్రబాబు నా సర్కార్ ని అస్థిరపరుస్తున్నారని గొంతు చించుకోవడం వెనక కూడా రాజకీయమే ఉంది. ఆ విధంగా సవాల్ చేస్తున్నారు ఆయన. దమ్ముంటే కూలదోయండి అంటూ ముందుకు వస్తున్నారు. కానీ మోడీ నాలుగు ఆకులు ఎక్కువే చదివారు కాబట్టి ఆ పని ఎప్పటికీ చేయారు. ఇదంతా బాబు అండ్ కో ఆడుతున్న డ్రామాగా బీజేపీ పెద్దలు అంటున్నారు. ఏపీ సర్కార్ మరో ఆరు నెలల పాటు సాఫీగా పాలన చేసుకోవచ్చు. ఎటువంటి భయమూ లేదని కూడా బీజేపీ నాయకులు భరోసా ఇస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: