జగన్ ఏపీ రాజకీయాల్లో ఇపుడు కేంద్ర బిందువుగా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జగన్ క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఆయన పాదయాత్రకు జనం వెల్లువలా తరలివస్తున్నారు. వైసీపీ గెలుపు మీద అంచనాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్న ఏపీ పాలిటిక్స్ లో  జగన్  బిగ్ ఫిగర్. రేపటి ఎన్నికల్లో గెలిచే పార్టీగా ముందున్న వైసీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్ ఇపుడు ఏపీలో మార్మోగుతున్న పేరు. 


చిరంజీవి ఫోన్ :


వైసీపీ అధినేత జగన్ ఈ మధ్యన హత్యాయత్నం నుంచి బతికి బయట పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం జగన్ ఇంట్లో విశ్రాంత్రి తీసుకుంటున్నారు. అందరూ జగన్ ని పరామర్శించారు. తాజాగా కెంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి జగన్ కి ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. పరామర్శ వరకు తీసుకున్నా కూడా  ఇది రాజకీయంగా కూడా చర్చనీయాంశమవుతోంది. చిరంజీవి ఈ మధ్యన రాజకీయంగా అంత చురుకుగా లేరు. అదే టైంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా రెన్యూవల్ చేసుకోలేదు. 


జనసేన వెనక :


ఇక చిరంజీవి జనసేన వెనక ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. తమ్ముడు పార్టీకి సలహా సూచనలు ఇస్తూ చిరంజీవి తెర వెనక‌ భూమికను పోషిస్తున్నారని అంటున్నారు. వీలైతే రేపటి రోజున అదే పార్టీ తరఫున రంగంలోకి దిగుతారని కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ జనసేనకు పనిచేస్తున్నారు. ప్రజారాజ్యం మాజీ నేతలు ఇపుడు జనసేనలో చేరుతున్నారు. ఏ పరిణామాలను బట్టి చూసుకున్నపుడు చిరంజీవిని రాజకీయాల నుంచి విడదీయలేము.


స్నేహ హస్తమేనా :


చిరంజీవి ఫోన్ చేయడాన్ని రాజకీయంగా తీసుకుంటే రేపటి రోజున జనసేన, వైసీపీ స్నేహ  బంధానికి ప్రాతిపదికగా చూడొచ్చా అన్న ఇంటెరెస్టింగ్ చర్చ సాగుతోంది. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య పెద్దగా వైరం అనేది లేదు. అప్పట్లో జగన్ పవన్ పెళ్ళిళ్ళ గురించి ఓ మాట తూలినా ఆ తరువాత మరేం అనలేదు. ఇక పవన్ సైతం తన మీటింగులలో జగన్ అంటే తనకు శత్రువు కానే కాదని చెప్పుకొస్తున్నారు.


 దీన్ని బట్టి చూసుకుంటే రెండు పార్టీలు కలసి నడిచేందుకు పెద్దగా అభ్యంతరాలు లేవు. పైగా ఇద్దరి ఉమ్మడి శత్రువు చంద్రబాబు ఉండనే ఉన్నారు. దానికి నాందిగానే చిరంజీవి ఫోన్ ని చూడాలని అంటున్నారు. మరి రేపటి రోజున జగన్, పవన్ బంధం గట్టిపడేందుకు  ఓ పెద్దగా చిరంజీవి తెర వెనక పెద్దగా ప్రయత్నాలు చేస్తారేమోనన్న చర్చ కూడా సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: