ఓ వైపు జగన్ విషయంలో ఉన్నది లేనట్లుగా చంద్రబాబు, మంత్రులు, అనుకూల మీడియా మాట్లాడుతూ మభ్యపెడుతూంటే మరో వైపు పోలీసు రిమాండ్ రిపోర్ట్ మాత్రం  షాక్ తినిపించేలా వచ్చింది. జగన్ పైన జరిగింది చిన్న దాడి ఏ మాత్రం కాదని అది హత్యాయత్నమేనని రిమాండ్ రిపోర్ట్ స్పష్టంగా చెబుతోంది. దీంతో జగన్ విషయంలో అధికార పార్టీకి ఇపుడు మింగుడు పడని వ్యవహారమైంది.  దీనిపైన కక్కలేక మింగలేక అన్నట్లుగా పసుపు పార్టీ నేతల పరిస్థితి ఉంది.


అలా ప్రచారం:


జగన్ తనపైన కావాలని దాడి చేయించుకున్నారని ఇంతవరకూ టీడీపీ ఎదురుదాడి చేస్తూ వచ్చింది. నిజానికి జగన్ అలా చేయించుకుని ఉంటే ఇంతటి రిస్క్ తీసుకుంటారా అని వైసీపీతో పాటు బుర్రున్న వారంతా లాజిక్ పాయింట్లు తీసినా మూడు రోజులుగా చెబుతున్నదే చెబుతూ టీడీపీ పెద్దలు తమ వాదనను గట్టిపరచుకునే ప్రయత్నమే చేస్తున్నారు. కానీ ఇపుడు వారి ఆద్వర్యంలోని పోలీసులే రిమాండ్ రిపోర్ట్ రాసారు. అందులో జగన్ మీద జరిగింది హత్యాప్రయత్నమేనని క్లారిటీ ఇచ్చేశారు.


ఇపుడేమంటారో:


జగన్ కి అద్రుష్టం ఉంది కాబట్టే బతికిపోయారని, ఆయన ఆ టైంలో తల పక్కకు తిప్పడంతోనే మెడ మీద లక్ష్యంగా చేసుకుని ఎత్తిన కోడి పందేల కత్తి గురి తప్పి భుజంపైన తగిలిందని రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది. దీనిని బట్టి చూస్తే పక్కా స్కెచ్ తో ఈ పధకం వేసినట్లుగా ఉందని అంటున్నారు. జగన్ పై ముమ్మాటికీ హత్యా ప్రయత్నమే జరిగిందని వైసీపీ పదే పదే చేస్తున్న వాదన దీనితో బలపడినట్లైంది. అదే టైంలో టీడీపీ చెఉబుతున్న దాడి డ్రామ కధ తప్పు అని కూడా రుజువైంది మరి దీనికి తమ్ముళ్ళు ఇపుడేమంటారో.


మరింత సమాచారం తెలుసుకోండి: