టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు తెలంగాణా రాజ‌కీయాలు క‌లిసి రావ‌డం లేదా? ఆయ‌న వ్యూహాలు బెడిసి కొడుతున్నా యా? అంటే.. తాజాగా జ‌రిగిన ఓ ప‌రిణామం.. ఔన‌నే అంటోంది. తెలంగాణాలో పావులు క‌ద‌పాల‌ని, అక్క‌డ నిల‌దొక్కు కోవాల‌ని ఏపీ సీఎంచంద్ర‌బాబు భావిస్తున్నారు. టీడీపీని జాతీయ పార్టీగా మార్చేందుకు ఆయ‌న వ్యూహాత్మ‌కంగా ముం దుకు వెళ్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయన ప‌న్నుతున్న వ్యూహాలు మొత్తంగా బెడిసి కొడుతున్నాయి. గ‌తంలో మూడేళ్ల కింద‌ట ఎమ్మెల్సీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓటుకునోటు వ్య‌వ‌హారం.,. పెను సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసు తాలూకు నీడ‌లు ఇప్ప‌టికీ చంద్ర‌బాబును వెంటాడుతూనే ఉన్నాయి. తెలంగాణా సీఎం కేసీఆర్ ఇటీవ‌ల కూడా దీనిని అడ్డం పెట్టుకుని వ్యాఖ్య‌లు సంధించారు. 

nara chandrababu naidu కోసం చిత్ర ఫలితం

క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఎన్నిక‌లకు వేళ‌యింది. తెలంగాణాలో ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి. డిసెంబరు 7న ఎన్నిక‌ల కు ముహూర్తం కూడా ఖ‌రారైంది. అయితే, ఇప్పుడు తెలంగాణాలోనూ వేళ్లూనుకోవాల‌ని చూస్తున్న చంద్ర‌బాబు.. అక్క డ మ‌హాకూట‌మిగా జ‌ట్టుక‌ట్టి ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్‌, సీపీఐ, టీజేఎస్‌ల‌తో క‌లిసి టీడీపీ మ‌హాకూట‌మిగా ఏర్ప డింది. అయితే, ఇంత వ‌ర‌కు ఎవ‌రూ కాద‌న‌రు., అయితే, అక్క‌డి రాజ‌కీయాలు, ఓట‌ర్ల నాడిని తెలుసుకోవ‌డం, త‌న‌కు అనుకూ లం గా ప‌రిస్థితుల‌ను మలుచుకోవడం కోసం చంద్ర‌బాబు చేసిన వ్యూహం ఇప్పుడు బెడిసి కొట్టింది. ఏపీ ఇం టిలిజ‌న్స్ పోలీసుల‌ను పార్టీ కార్య‌క‌ర్త‌లుగా చంద్ర‌బాబు రంగంలోకి దించిన విష‌యం తాజాగా వెల్ల‌డైంది. 


జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి తీరం. ఈనెల 25న నారాయణ రెడ్డి, వెంకటేశ్వర్‌ రావు, మధు అనే ముగ్గురు వచ్చా రు. గోదావరి ఒడ్డున ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో గదులు అద్దెకు తీసుకున్నారు. జర్నలిస్టులమని చెప్పుకొంటూ మూడు రోజులుగా గోదావరి తీరం, దేవాలయ పరిసరాలు, బస్టాండ్‌ ప్రాంతంలో తిరిగారు. ప్రజలను, ఆలయానికి వచ్చే భక్తులను ఇతరులను కలుస్తూ ఏ పార్టీకి ఓట్లు వేస్తున్నారని అడిగారు. స్థానికులకు అనుమానం వచ్చి అడిగారు. ఈ సందర్భంగా స్థానికులకు, వారికి మధ్య గొడవ జరిగింది. దాంతో, పోలీసులకు సమాచారం అందించారు. పొంతన లేని సమాధానాలు చెబుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. 

2018telanganaelections కోసం చిత్ర ఫలితం

ఐడీ కార్డుల ఆధారంగా వారు ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులని గుర్తించారు. వారిని ఎస్పీ సింధు శర్మ వద్దకు తీసుకెళ్లారు. ‘‘ఏపీకి చెందిన ముగ్గురు ఇంటెలిజెన్స్‌ అధికారులు ధర్మపురిలో సంచరించినట్లు గుర్తించాం. విచారణలో ఎలాంటి వివరాలూ చెప్పలేదు. వారి వద్ద ఉన్న వివరాలను బట్టి కేవలం సర్వే కోసమే వచ్చినట్లు గుర్తించాం’’ అని జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ చెప్పారు. ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగా పెను దుమారానికి దారి తీసింది. అధికార టీఆర్ ఎస్ చంద్ర‌బాబు కేంద్రంగా దుమ్మెత్తిపోసింది. దీంతో మ‌రోసారి చంద్ర‌బాబు అడ్డంగా బుక్క‌య్యార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఆయ‌న‌కు తెలంగాణా రాజ‌కీయాలు క‌లిసి రాలేద‌ని చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: