జగన్ మీద దాడిని ఖండించాల్సింది పోయి జగన్ మీదే చంద్ర బాబు ఎదురు దాడికి దిగడం అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఒకపక్క జగన్ కు తీవ్ర గాయమై హాస్పిటల్ వెళితే దానిని కూడా బాబు హేళన చేసాడు.  దేవుడు కాపాడారు.. ప్రజలు అండగా ఉన్నారు.. ఎవరూ ఆందోళన చెందవద్దు అని జగన్‌ ప్రకటన చేస్తే, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు మాత్రం ఇదంతా డ్రామా అని, జగన్‌పై దాడి చేసింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభిమాని అని తేల్చిన తీరు అత్యంత అభ్యంతరకరం. అభిమానులు కోడి పందాల కత్తులతో నేతలను పొడవడానికి వస్తారా? దానివల్ల సానుభూతి వస్తుందా? అలాగైతే అలిపిరిలో మావోయిస్టులు చేసిన దుశ్చర్యతో చంద్రబాబుకు సానుభూతి రాలేదే.


జగన్ ముందు చంద్ర బాబు ఎత్తులు పారలేదు...!

అప్పుడు ఆనాటి ప్రతిపక్షనేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ ఘటనను ఖండించడమే కాకుండా, మావోయిస్టులకు వ్యతిరేకంగా ఒకరోజు నిరశన కూడా చేశారే. కాని ఇప్పుడు జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనలో చంద్రబాబు స్పందించిన వైనం ఆయనను అప్రతిష్టపాలు చేసింది. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలాంటి విషయాలలో ఇంత నీచంగా స్పందించలేదు. సాధారణంగా అయితే ఏమి చేయాలి? ప్రతిపక్ష నేతపై దాడి జరిగినట్లు తనకు తెలిసిందని, దానిని ఖండిస్తున్నానని, నింధితుడు ఏ పార్టీకి చెందినవాడు అయినా ఇలాంటివి జరగడానికి వీలులేదని, అతనిపై కఠినచర్య తీసుకుంటామని చెప్పాల్సి ఉంది.


జగన్ ముందు చంద్ర బాబు ఎత్తులు పారలేదు...!

అంతేకాదు.. వెంటనే జగన్‌కు పోన్‌చేసి యోగ క్షేమాలు ఆరాతీసి, మనోధైర్యం చెప్పవలసి ఉంది. ఆ పని చేయకపోగా జగన్‌ను పలకరించిన వారిని, పరామర్శ చేసినవారిని విమర్శించడం ద్వారా చంద్రబాబు కొత్తగా చెడ్డ సంప్రదాయానికి తెరదీశారని చెప్పక తప్పదు. ముఖ్యమంత్రి హుందాతనం కోల్పోవడం, అసహనంగా మాట్లాడడం వంటివి చూస్తే, ఆయనలో ఏదోతేడా ఉందా అన్న అభిప్రాయం కలుగుతుంది. చంద్రబాబు భావిస్తున్నట్లు నిజంగానే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభిమాని దాడిచేస్తే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? మొత్తం ఈ ఎపిసోడ్ లో జగన్ హీరో అయితే బాబు జీరో అయ్యాడని చెప్పాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: