పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఉంది యూపీ కి  ప్రయాణం అవ్వడం అందరూ ఖంగు తిన్నారు. అయితే పవన్ మాయావతి తో భేటీ అవ్వడానికి వెళ్లారు. అయితే పవన్ కు మాయావతి అపాయింట్ మెంట్ దొరక చివరకి వెనక్కి వచ్చేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ వామపక్షాలతో కలిసి పోటీచేస్తుందని ఆ పార్టీలు చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఎటూ జనసేనకు క్షేత్రస్థాయిలో బలంలేదు గనుక.. వామపక్షాల వ్యవస్థీకృత యంత్రాంగాన్ని వాడుకోవాలని పవన్ భావిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తాను కొంత సొంతంగా పార్టీలాగా నిలదొక్కుకోగానే పవన్ వారిని పక్కన పెట్టసాగారు. అన్నాళ్లూ పవన్ ను నమ్ముకుని తిరిగినందుకు వారికి రిక్తహస్తమే ఎదురైంది.

Image result for pawan kalyan janasena

కాకపోతే.. పొత్తులు ఉండవు అని కూడా పవన్ ఎన్నడూ వారికి తేల్చిచెప్పలేదు. వారంతట వారు రాష్ట్రంలో తాము పవన్ తో కలిసి పోటీచేస్తాం అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. తెలంగాణలో అయితే సీపీఎం ఏకంగా పవన్ మీద చాలా ఎక్కువ ఆశలు పెట్టేసుకుని, దారుణంగా దెబ్బతింది. ఇప్పుడు ఈ తాజా ట్వీట్ ద్వారా పవన్ వామపక్షాలకు షాక్ ఇచ్చారని అందరూ అనుకుంటున్నారు. కానీ నిజానికి తనకు తగిలిన షాక్ ను తట్టుకోలేక పవన్ ఇలా ఆక్రోశం వెళ్లగక్కుతున్నాడని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వామపక్షాలే తమ జేబులో ఉన్నాయని పవన్ భావిస్తోంటే.. ఢిల్లీలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి, చంద్రబాబుతో భేటీ అయ్యారు.

పవన్ కల్యాణ్ : వృద్ధ నారీ పతివ్రత:

అలాగే తాను లక్నో వెళ్లినా పవన్ కు బీఎస్పీ మాయావతి అపాయింట్ మెంట్ దక్కలేదు. ఇతర నాయకులతో మాట్లాడి.. కాన్షీరాం భజన చేసి  ఆయన తిరిగొచ్చారు. బీఎస్పీతో పవన్ పొత్తు ఉంటుందంటూ కొంత ప్రచారం జరిగింది. అయితే.. ఆమె చంద్రబాబునాయుడుతో భేటీకావడం మాత్రమే కాకుండా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బయటిదాకా వచ్చి చంద్రబాబు నెత్తిన చేయిపెట్టి ఆశీర్వదించి మరీ సాగనంపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: