అనుకోకుండా జరిగిన కొన్న ఘటనలు కీలకమైన మలుపులు తిప్పుతూంటాయి. రాజకీయానావ ఎపుడూ సాఫీగా సాగదు, వాటం చూసుకుని ఎంత నడిపినా గాలి విసిరేస్తూనే ఉంటుంది. దానికి తగినట్లుగా నావను ఒడుపుగా నడుపుకునే సామర్ధ్యం ఉండాలి. ఏపీ రాజకీయాలు ఇపుడు చాలా వేగంగా మారిపోతున్నాయి. వాటిని సానుకూలం చేసుకునే సత్తా ఎవరికి ఉందో


హత్యాయత్నం :


వైఎస్ జగన్ పై జరిగిన అటాక్ కూడా అటువంటిదే. అనూహ్యంగా జరిగిన ఈ దాడి నుంచి  జగన్ అద్రుష్టవశాత్తు తప్పించుకున్నారు. మొదట్లో పెద్దగా ప్రభుత్వం స్పందించపోయినా పోలీస్ రిమాండ్ రిపోర్ట్ వచ్చిన తరువాత మాత్రం ఘటన తాలూకా సీరియస్నెస్ ఇంకా బాగా తెలిసింది. అధికారికంగా వచ్చిన రిపోర్ట్ కావడంతో దీన్ని ఎవరూ కొట్టిపారేయలేరు. ఈ నేపధ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డీజీపీలో సమావేశం కావడం ఉన్నతస్థాయి దర్యాప్తున‌కు ఆదేశాలు ఇవ్వడం జరిగాయి.


జగన్ ఎలా స్పందిస్తారు :


జగన్ ఇపుడు విజయనగరం జిల్లా సాలూరులో పాదయాత్ర చేస్తున్నారు. మరో వారం రోజుల వరకూ ఆయన విశ్రాంతి తీసుకుంటారు. అంటే ఆయన పాదయాత్రలో తిరిగి జాయిన్ అయ్యేది మాత్రం నవంబర్ 3వ తేదీనే. జగన్ ఈ ఘటనపై ఇంతవరకూ స్పందించినది కూడా లేదు. ఆయన పాదయాత్రలోనే ఏమైనా చెప్పాలి. మరి జగన్ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తారా. ఈ హత్యాయత్నం ఘటనను ఏ విధంగా మలచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 


సానుభూతి ఉంటుందా :


ఇక జగన్ కు ఇప్పటికే జనం వెల్లువలా వస్తున్నారు. రేపటి రోజున ఆయన పాదయాత్రకు కూడా పోటెత్తుతారు. అయితే సానుభూతి ఉంటుందా, ఉంటే దానికి వైసీపీ ఎలా ఉపయోగించుకుంటుందన్నది చూడాల్సిన అవసరం ఉంది. జగన్ విషయంలో చూసుకుంటే ఆయన ఆ దిశగా ఆలొచన చేస్తారని అనుకోవడానికి వీలులేదు. కానీ తనపై జరిగిన దాడి పట్ల చంద్రబాబు ప్రభుత్వం స్పందించిన తీరుని మాత్రం ఆయన ఇకపై ప్రతి సభలోనూ బాగా ఎండగడతారని చెప్పుకోవాలి. మొత్తం మీద చూసుకుంటే మాత్రం హత్యాయత్నం ఘటన జగన్ కి సానుభూతిని పెంచిందనే చెప్పుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: