వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు తాలూకు కేసును విచారణ జరుపుతున్న మహారాష్టల్రోని ధర్మాబాద్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తికి తాజాగా బెదిరింపు లేఖ రావటం పై న్యాయ స్థానాల్లోను ప్రజల్లోను కలవరం సృష్టిస్తోంది. హైదరాబాద్‌ లోని  కమ్మ సంఘం పేరిట గుర్తు తెలియని వ్యక్తులు మూడు పేజీల బెదిరింపు లేఖను స్పీడ్ పోస్టు ద్వారా పంపించారు. 
thretening letter to maharashtra dharmabad judge కోసం చిత్ర ఫలితం
బాబ్లీ కేసు లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జారీ చేసిన "నాన్-బెయిలబుల్-వారెంట్‌ — NBW" ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ లేఖ లో హెచ్చరించినట్టు తెలిసింది. ఈ బెదిరింపు లేఖ గురించి న్యాయమూర్తి ధర్మాబాద్ పోలీసుల దృష్టికి తేవడంతో వారు ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. 
thretening letter to maharashtra dharmabad judge కోసం చిత్ర ఫలితం
ఈ బెదిరింపు లేఖ వెనుక ఉన్న అదృశ్య శక్తుల ఆచూకీ ఎలాగైనా తెలుసుకోవాలనే పట్టుదలతో మహరాష్ట్ర పోలీసులు దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. ఇంగ్లీష్లో రాసిన లేఖ లోని అంశాలను బట్టి చూస్తే, ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు కు వారెంట్ జారీ చేయడం వల్లే ఆయనను అభిమానించే వ్యక్తులు ఈ బెదిరింపు లేఖను పంపించి ఉంటారని అనుమానిస్తున్నారు. 
kamma sangham hyderabad telangana కోసం చిత్ర ఫలితం
సరిహద్దున గోదావరిపై మహారాష్ట్ర చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 2010 లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ప్రతిపక్ష నేత హోదాలో నారా చంద్ర బాబు నాయుడు తన పార్టీ ప్రతినిధులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో కలిసి నిరసన తెలిపేందుకు హాజరైన సందర్భంగా సరిహద్దు లోనే ధర్మాబాద్ పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. 
dharmabad court కోసం చిత్ర ఫలితం
అనంతరం సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. అయితే ఈ ఉదంతానికి సంబంధించి ధర్మాబాద్ కోర్టు గత రెండు మాసాల క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తో సహా మరో 15మందికి నాన్‌-బెయిలబుల్-వారెంట్లు జారీ చేయడం నాడు చర్చనీయాంశమైంది. బాబు సహా మిగతా వారంతా నేరుగా విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
dharmabad court కోసం చిత్ర ఫలితం
ఈ విషయంలో NBW  విడుదల కావటానికి ప్రధాని నరెంద్ర మోడీ, కేంద్రం లోని బిజెపియే కారణమని చంద్రబాబు చిందులేశారన్న సంగతి జగమెరిగిన సత్యమే. మరి ఈ లేఖ రాసిన మన కమ్మ సోదరులకు చంద్రబాబు దిశానిర్దేశం చెశారని మహరాష్ట్ర వాసులంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: