చంద్రబాబునాయుడు సీనియర్ రాజకీయవేత్త. ఒకపుడు డిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన నాయకుడు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో ఏదో రూపంలో కీలకంగా మారుతున్న చరిత్ర ఉంది. అటువ్నటి నాయకుడు  తాజాగా డిల్లీ వస్తే ఆశించిన తీరులో స్పందన లేదన్నది లేటెస్ట్ టాక్.


 హస్తిన  టూర్ ఫ్లాపేనా:


చంద్రబాబు హస్తిన పర్యటన ఎందుకు చేశారు, ఏమాశించి హటాత్తుగా డిల్లీ వెళ్లారు అన్న ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకడం లేదు. అయితే దాని మీద ఊహాగానాలు మాత్రం బోలెడు ఉన్నాయి. బాబు డిల్లీ టూర్లో జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతారని అనుకూల మీడియా చాలా ఊదరగొట్టింది. అయితే అక్కడ సీన్ మాత్రం రివర్స్ అయింది. దేశంలోకెల్లా సీనియర్ అని చెప్పుకునే బాబుని కలిసేందుకు  అక్కడ పెద్దగా ఎవరూ ఆసక్తి చూపించకపోవడం విశేషం.


ఆ ముచ్చట్లతో సరి !


ఈ మధ్యన రాజకీయల్లోకి వచ్చిన డిల్లీ సీఎం కేజ్రీవాల్, కాశ్మీర్ నాయకుడు ఫారూక్ అబ్దుల్లా, మాయవతి తప్ప మిగిలిన వారెవరూ తొంగి చూడలేదు. మాయావతి నుంచి కూడా ఆశించిన స్పందన లేదు. వచ్చిన వాళ్ళతోనే ముచ్చట్లు పెట్టుకుని మీడియా ముందుకు వచ్చిన బాబు మోడీని తిట్టడంతో హస్తిన టూర్ అయిందనిపించారు. ఇక బాబు మోడీపై మీడియాలో చేసిన విమర్శలు కూడా చాలా పాతవి కావడం విశేషం. దాంతో వాటికి కూడా జాతీయ మీడియా అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని టాక్.


విశ్వసనీయతే కారణం :


బాబుకు జాతీయ మీడియా, పార్టీలు దూరంగా జరగడానికి ఆయన వైఖరి పట్ల సందేహాలు ఉండడమే కారణమని ప్రచారంలో ఉంది.  బాబు ఎపుడు ఎలా స్పందిస్తారో తెలియదని, ఆయన అవకాశవాద రాజకీయాలకు కూడా అంతే లేదని జాతీయ పార్టీల నుంచి మాటగా ఉంది. నిన్నటి వరకూ మోడీ పక్కన ఉన్న బాబు ఏపీ రాజకీయల ద్రుష్ట్యా కాసింత పక్కకు జరిగాడని, రేపు మళ్ళీ మోడీ పవర్లోకి వస్తే ఇదే బాబు ఆయనకు వంత పాడినా ఆశ్చర్యం లేదని జాతీయ పార్టీన నేతలు అనుకుంటున్నారట. అందువల్లనే బాబుకు మునుపటి ఆదరణ, స్పందనా లేకుండా పోయాయని అంటున్నారు. మొత్తానికి బాబు డిల్లీ టూర్ ఓ ఫ్లాప్ షోగా మిగిలిందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: